- ఆన్ లైన్ లో గంజాయి కొన్నట్టు ఆధారాలు ఉన్నాయంటూ ఫోన్ కాల్
- అరెస్ట్ చేసేందుకు స్పెషల్ పోలీసులు వస్తున్నారని బెదిరింపులు
- భయపడి వారు కోరిన డబ్బు చెల్లించిన యువతి
- కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట పోలీసులు
ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడడంలేదు. తాజాగా, పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓసాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని బెదిరించిన కేటుగాళ్లు రూ.11 లక్షలు వసూలు చేశారు. ఆన్‌లైన్ లో గంజాయి కొన్నట్టుగా ఆధారాలు ఉన్నాయని మోసగాళ్లు ఆ ఐటీ ఉద్యోగినికి ఫోన్ చేశారు. అరెస్ట్ చేసేందుకు స్పెషల్ పోలీసులు వస్తున్నారంటూ ఆ యువతికి ఫోన్ కాల్స్ చేశారు.
దాంతో భయపడిపోయిన ఆ ఉద్యోగిని ఆన్‌లైన్‌లో వారడిగిన డబ్బు చెల్లించింది. అనంతరం, ఈ వ్యవహారంపై ఆమె నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.