Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు…మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు

  • హెల్త్ కార్డులు, అక్రిడేషన్ సమస్యలకు త్వరలోనే పరిష్కారం
  • తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • కూసుమంచిలో పాలేరు నియోజక వర్గ మీడియా మిత్రుల ఆత్మీయ సమావేశం

అర్హులైన ప్రతీ జర్నలిస్టు కి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇళ్ల స్థలం మంజూరు చేయించడం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కూసుమంచి లోని విజయరామ ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగిన పాలేరు నియోజక వర్గ మీడియా మిత్రుల సమావేశంలో మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల సమస్యలను తమ ప్రభుత్వంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జర్నలిస్టు ఇండ్ల సొసైటీ సమస్య సుప్రీం కోర్టు పరిధిలో ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ గురించి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అతి త్వరలోనే వారి సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అక్రిడేషన్, హెల్త్ కార్డుల మంజూరు జాప్యం, అమలులో తలెత్తుతున్న లోపాలను సవరిస్తామని తెలిపారు. అలాగే మీడియా మిత్రుల విజ్ఞప్తి మేరకు కూసుమంచి కేంద్రంలో మీడియా హౌజ్ కానీ ప్రెస్ క్లబ్ కానీ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇవి కాకుండా ఇంకా ఏవైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని జర్నలిస్టులకు సూచించారు. తన పరిధిలో ఉన్న సాధ్యమైన , న్యాయమైన కోరికలన్నీ పరిష్కరిస్తానని మంత్రి పొంగులేటి వారికి హామీ ఇచ్చారు.

Related posts

జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రక్కదారిపై విచారణ పూర్తి..అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ

Ram Narayana

మైక్ ముందు ఐదు నిమిషాలు మాట్లాడలేని వ్యక్తిని ఎమ్మెల్యే గా గెలిపించారు- పొంగులేటి…

Ram Narayana

రఘునాథపాలెం మండలానికి మహర్దశ మంచుకొండ ఎత్తిపోతల పథకం…మంత్రి తుమ్మల

Ram Narayana

Leave a Comment