Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయం: ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు…

మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయం: ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు
2024 ఎన్నికల్లో మాదే విజయం
వర్షాకాల సమావేశాలు రెండు రోజులేనా?
ప్రభుత్వాన్ని కూల్చాలని అనుకోవడం లేదు

మహారాష్ట్రలోని మహావికాశ్ అఘాడీ ప్రభుత్వం ఏదో ఒక రోజు కుప్పకూలడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కూలే వరకు తాము బలమైన ప్రతిపక్షంగానే ఉంటామన్నారు. నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది . ఇటీవల శివసేనకు చెందిన ప్రతాప్ సర్నాయక్ అనే ఎమ్మెల్యే బీజేపీ తో చేతులు కలపాలంటూ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే కు లేఖ రాయడం ,ఫడ్నవిస్ ప్రభుత్వం కూలి పోతుందని వ్యాఖ్యానించడంపై మహారాష్ట్ర రాజకీయాలలో ఆశక్తికర చర్చ జరుగుతుంది .

గత ఎన్నికల్లో బీజేపీ శివసేన కలిసి పోటీచేసినప్పటికీ ముఖ్యమంత్రి పీఠం విషయంలో వచ్చిన తేడాలతో అనుకోకుండా కాంగ్రెస్ ,ఎన్సీపీ తో కలసి సర్కార్ ను ఏర్పాటు చేసిన శివసేన వైఖరిలో మార్పు వచ్చిందా లేక కూటమిలోని పార్టీలు శివసేన తో విభేదించ నున్నాయా ? అనే గూగుసలు . గ్యాసిప్స్ మహా రాజకీయాలను వేడి ఎక్కిస్తున్నాయి. కాంగ్రెస్ నేత ఒకరు తానే ముఖ్యమంత్రి అని ప్రకటించడం , ఇటీవల ప్రధానిని కలిసిన ముఖ్యమంత్రి ఉద్దవ్ తిరిగి బీజేపీ తో చేతులు కలిపేందుకు సిద్దపడుతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి….,

కరోనా పేరు చెప్పి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష నేత ఫడ్నవిస్ ఆరోపించారు. ఇప్పుడు కూడా వర్షాకాల సమావేశాలను రెండు రోజులే నిర్వహించాలని ప్రతిపాదించడం సరికాదని మండిపడ్డారు. బీఏసీ సమావేశం నుంచి తాము తప్పుకోవడంపై మాట్లాడుతూ.. రైతులు, ప్రజలు, విద్యార్థులు, శాంతిభద్రతలు, మరాఠా రిజర్వేషన్లు తదితర సమస్యలపై చర్చించేందుకు రెండు రోజుల సమయం చాలా తక్కువని అన్నారు. అందుకనే బీఏసీ సమావేశం నుంచి తప్పుకున్నట్టు ఫడ్నవీస్ పేర్కొన్నారు.

బీజేపీతో చేతులు కలపాలంటూ శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌కు లేఖ రాయడంపై ఫడ్నవీస్ స్పందిస్తూ.. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలని తాము అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఏమైనా, 2024 ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

తిరుపతి ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ…

Drukpadam

టీటీడీ బోర్డు నుంచి ఆ 52 మందిని తొలగించండి: గవర్నర్ ను కోరిన సోము వీర్రాజు!

Drukpadam

‘ల్యాండ్ ఫర్ జాబ్’ కుంభకోణం.. తేజస్వీ యాదవ్ అరెస్టుకు రంగం సిద్ధం?

Drukpadam

Leave a Comment