Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఆనందయ్య కరోనా మందు పంపిణి పై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం…

ఆనందయ్య కరోనా మందు పంపిణి పై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం
-మా మందుకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదున్న ఆనందయ్య
-ఇది ఎంతో బాదారకమని ఆవేదన
-మందు పంపిణీ కోసం లేఖ రాసినా స్పందన రాలేదు
-పార్టీలతో సంబంధం లేకుండా మందు అందిస్తున్నాం
-మందును అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కు చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య కరోనా మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చేతులేత్తిసిందా ? అంటే అవుననే సమాధానమే వస్తుంది ఆనందయ్య నుంచి ……
కరోనా కోసం తాము తయారు చేస్తున్న మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆనందయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు బాధాకరమని గగ్గోలు పెడుతున్నారు. మందు పంపిణీకి సంబంధించి ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ… సరైన స్పందన రాలేదని చెప్పారు. మందు తయారీకి సరైన సామగ్రి సమకూరకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, అందుకే మందు తయారీలో వెనుకబడ్డామని తెలిపారు. అయినా పలువురు దాతలు అందిస్తున్న సహకారంతో ప్రజలకు మందును అందిస్తున్నామని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా మందును అందిస్తున్నామని తెలిపారు.

బడ్డీ బంకుల్లో తమ మందును అమ్ముతున్నారని… అది ప్రభుత్వ లోపమేనని ఆనందయ్య అన్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా బాధితులందరికీ కరోనా మందును ఉచితంగా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రతి జిల్లాలో ప్రజాప్రతినిధుల ద్వారా మందును అందజేస్తున్నామని తెలిపారు. ఏయే జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నాయో… ప్రజాప్రతినిధులు, అధికారులు తెలుసుకుని తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.

మందు పంపిణి విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆటంకాలు లేనప్పటికీ సహకారం మాత్రం లేదని స్పష్టం చేస్తున్నారు. మొదట ఎంతో ఆర్బాటంగా ఉరుకులు పరుగులు పెట్టిన ప్రభుత్వ పెద్దలు అధికారులు ఆనందయ్య ను పట్టించుకోవడం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆయన కంట్లో వేస్తున్న చుక్కల మందులో విష పదార్థాలు ఉన్నట్లు కోర్టుకు తెలపడం తో ఆనందయ్య ముందుకు కొంత క్రేజ్ తగ్గిందనే అంటున్నారు. కోర్టు నుంచి ఇంకా ఎలాంటి తీర్పు రాలేదు …

Related posts

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ర్ఫ్యూను ఈ నెలాఖరువరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం…

Drukpadam

గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుంది: యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్…

Drukpadam

ఆక్సిజన్ కొరత వీలయితే విమానాల్లో పంపండి … మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే

Drukpadam

Leave a Comment