ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూకంపం…

  • ఇచ్చాపురం పరిసర ప్రాంతాలలో స్వల్పంగా భూ ప్రకంపనలు
  • వేకువ జాము 3.45 గంటల ప్రాంతంలో రెండు సెకనుల పాటు కంపించిన భూమి
  • భయంతో ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీసిన ప్రజలు

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు అందరూ నిద్రిస్తున్న సమయంలో వేకువ జాము 3.45 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా నిద్రలో నుండి లేచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఏం జరిగిందో కాసేపు అర్ధం కాక అయోమయానికి గురయ్యారు. భారీ స్థాయిలో వచ్చి ఉంటే తమ పరిస్థితి ఘోరంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 

Related posts

చిన్న కమ్మవాళ్లు అంటే కాపులే: టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Ram Narayana

సింగయ్య మృతి కేసు .. జగన్‌కు హైకోర్టులో తాత్కాలిక ఊరట

Ram Narayana

ఎన్టీఆర్ జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం!

Ram Narayana