Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖబర్దార్ కేసీఆర్ నీ పతనం ప్రారంభమైంది …..బండి సంజయ్…

ఖబర్దార్ కేసీఆర్ నీ పతనం ప్రారంభమైంది …..బండి సంజయ్
– నీపై దాడులు చేసే రోజు వస్తుంది:
-కేసీఆర్ డైరెక్షన్ లో టీఆర్ఎస్ గూండాలు దాడి చేస్తున్నారు
-ఓయూ జేఏసీ విద్యార్థి సురేశ్ యాదవ్ పై రెండో సారి దాడి జరిగింది
-ఈ దాడిని కేసీఆర్ ఎందుకు ఖండించలేదు

ఖబర్దార్ కేసీఆర్ నీపై దాడులు చేసే రోజు వస్తుంది…. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన ప్రభుత్వం దారులకు ప్రోత్సహిస్తున్నది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు….
నీ ఆగడాలు ఇంకా ఎంతో కాలం సాగవని ఇప్పటికైనా గూండాగిరిని ఆపకపోతే దాన్ని ఎలా ఎదురుకోవాలో మాకు బాగా తెలుసునని అన్నారు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రాక్షసుడని కేసీఆర్ డైరెక్షన్ లో టీఆర్ఎస్ గూండాలు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నీ పతనం ప్రారంభమైంది.. నీపై దాడులు చేసే రోజు వస్తుందని అన్నారు. మంచి చేయాలని చెబితే దాడుల అని మండిపడ్డారు … ఇక నీ పై దాడులు రకంగా ఉంటాయోకూడా నీవు ఉహించలేవని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులపై మంచి చెపితే , ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూ జేఏసీ విద్యార్థి సురేశ్ యాదవ్ ని ఈరోజు బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రోడ్లపై బరితెగించి దాడులు జరుగుతుంటే కాపాడాల్సిన ప్రభుత్వమే శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తోందని సంజయ్ విమర్శించారు. సురేశ్ యాదవ్ పై రెండో సారి దాడి జరిగిందని అన్నారు. ప్రజలందరూ చూస్తుండగా 20 మంది గూండాలు దాడి చేశారని చెప్పారు. ఈ దాడిని కేసీఆర్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. హాస్పిటల్ కి వెళ్తే చికిత్స కూడా చేయలేదని అన్నారు. సురేశ్ యాదవ్ పై దాడి చేసిన వారిపై సెక్షన్ 307 కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సురేశ్ కుటుంబ సభ్యులను మాటలతో వేధించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

Related posts

ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా పౌరసత్వం మంజూరు చేసిన పుతిన్!

Drukpadam

కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ విలీనం ప్రసక్తే లేదు: కోదండరామ్

Drukpadam

అటువైపా … ఇటు వైపా.. అయోమయంలో పొంగులేటి …!

Drukpadam

Leave a Comment