ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై సుధాకర్ రెడ్డి ఆగ్రహం …

ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుచితమని ,ఇది ఆయన అహంకారానికి నిదర్శనమని బీజేపీ తమిళనాడు ,కర్ణాటక సహా ఇంచార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆగ్రహం అవ్యక్తం చేశారు …ఆయన కులాన్ని గురించి ప్రస్తహిస్తే తాముకూడా కాంగ్రెస్ నాయకుల కులాన్ని గురించి ప్రస్తహించాల్సి వస్తుందన్నారు …పరిపాలన చేతకాక , ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న సీఎం చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు …దమ్ముంటే పేదలకు , మహిళలకు , రైతులకు , మహిళలకు , ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు …అంతేగాని పక్కదారి పట్టించే రాజకీయాలు చేయద్దని హితవు పలికారు …ఒక పేద కుటుంబం నుంచి వచ్చి దేశాన్ని ప్రగతి పథంలో నడుపుతున్న దార్శనిక నేతపై నిందలు వేయడం కులాన్ని గురించి మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయాలు నిదర్శనమని సుధాకర్ రెడ్డి అన్నారు …మోడీ అంటే ప్రపంచ దేశాలే గౌరవిస్తూ ఉంటె ఇక్కడ చోటామోటా నాయకులూ దురహంకారంగా మాట్లాడం అవివేకంగా ఉందని అన్నారు … దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఒక విజన్ తో ముందుకు పోతున్న గొప్ప నాయకుడిపై మాట్లాడే ముందు ఆలోచించుకోవలనన్నారు … ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాదు బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం చేతకాక రేవంత్ రెడ్డి గందరగోళానికి గురిఅవుతున్నారని దెప్పి పొడిచారు …ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ..

Related posts

ఏపీ డీజీపీ విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశం!

Drukpadam

ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ ….ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ …

Ram Narayana

రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం: అయ్యన్నపాత్రుడు..

Ram Narayana