సేవాలాల్ అంటేనే ఆదర్శ ప్రాయుడు …బంజారాల ఆరాధ్య దైవం …మంత్రి పొంగులేటి
సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి
హిందూధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావుడు
బంజారా జాతిని ఉత్తమ మార్గంలో నడిపించిన కారణజన్ముడు
సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది
ఒక్క బంజారాలకు కాకుండా ఇతర కులాలకు ఆదర్శం

సేవాలాల్ అంటేనే ఒక ఇన్సిపిరేషన్ …బంజారా జాతిని మేల్కొల్పిన యుగపురుషుడు ,వారి ఆరాధ్యదైవం అని రాష్ట్ర రెవెన్యూ ,గృహనిర్మాణ , సమాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు …సేవాలాల్ 286 జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం కూసుమంచి లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని సేవాలాల్ గొప్పతనాన్ని గురుంచి గుర్తు చేసుకున్నారు ..

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ లంబాడీలకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉందని అసలు లంబాడీ అంటేనే కాంగ్రెస్ పార్టీ…. కాంగ్రెస్ పార్టీ అంటేనే లంబాడీల పార్టీ అని అన్నారు … గత ఎన్నికల్లో నాకు భారీ మెజారిటీ రావడంలో లంబాడీలు కీలక పాత్ర పోషించారని అన్నారు … లంబాడీలను ఎస్టీలో చేర్చిన ఘనత కాంగ్రెస్ దే
సేవాలాల్ ను బంజారాల ఆరాధ్య దైవంగా పిలుస్తారని అన్నారు …. ఆయన 286 సంవత్సరాల క్రితం పుట్టిన మన గుండెల్లో ఉన్నారంటే అది ఆయన సమాజానికి జాతికి చేసిన సేవలకు గుర్తింపు అని కొనియారు .. హిందూధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావునిగా భావిస్తారని ఇది మొత్తం జాతి చేసుకున్న అదృష్టమని అన్నారు ..
సేవాలాల్ మహరాజ్ జయంతి పురస్కరించుకుని ఫిబ్రవరి 15న సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 2024లో సెలవు ప్రకటించిందని అన్నారు ..సంత్ సేవాలాల్ మహరాజ్ హింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శపురుషుడయ్యారని అని అన్నారు ..
సేవాలాల్ మహరాజ్ ఆనాడు బంజారా జాతి పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపిన గొప్ప వ్యక్తి అని అన్నారు . బ్రిటిష్ పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురి అయ్యిందని అలాంటి పరిస్థితులలో బంజారా జాతిని సన్మార్గంలో నడిపించేంందుకు సేవాలాల్ మహారాజ్ అవతరించారని అన్నారు …