ఐసీసీ ఈవెంట్ ను ఛాలెజింగ్ గా తీసుకున్న పాక్
- దాదాపు 29 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఐసీసీ ఈవెంట్ కు పాక్ ఆతిథ్యం
- 18 మంది సీనియర్ ఆఫీసర్లు, 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్‌స్పెక్టర్లతో సెక్యూరిటీ
- 1,200 మంది అప్పర్ సబార్డినేట్‌లు, 10,556 మంది కానిస్టేబుళ్ల నియామకం
- అలాగే ఆటగాళ్లు, ప్రముఖుల కోసం అందుబాటులోకి 9 స్పెషల్ చార్టర్ ఫ్లైట్లు
దాదాపు 29 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఓ ఐసీసీ ఈవెంట్ కు ఆతిథ్యం ఇస్తోంది. దీంతో ఈ టోర్నమెంట్ నిర్వహణ కోసం పాక్ బాగానే కష్టపడుతోంది. మ్యాచ్ లకు వేదికలుగా నిలుస్తున్న కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియాలను పునరుద్ధరించింది. అలాగే భద్రత విషయంలోనూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎక్కడ తగ్గలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది.
ఇందులో భాగంగా 18 మంది సీనియర్ ఆఫీసర్లు, 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్‌స్పెక్టర్లు, 1,200 మంది అప్పర్ సబార్డినేట్‌లు, 10,556 మంది కానిస్టేబుళ్లను నియమించింది. అదనంగా 200 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు. అలాగే ఆటగాళ్లు, ప్రముఖుల కోసం తొమ్మిది స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లను కూడా అందుబాటులో ఉంచింది. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ మధ్య ఇవి ప్రయాణిస్తాయి.
ఇక ఇవాళ ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ మార్చి 9 వరకు జరగనుంది. ఈసారి హైబ్రిడ్ మోడ్ లో జరుగుతున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు, రెండు గ్రూపులుగా పోటీపడుతున్నాయి. పాక్ తో పాటు దుబాయ్ లో మ్యాచ్ లు జరగనున్నాయి. టీమిండియా తన మ్యాచ్ లను దుబాయ్ వేదికగా ఆడనుంది. ఇక తొలి మ్యాచ్ లో పాక్, కివీస్ కరాచీ వేదికగా తలపడుతున్నాయి.