సినిమా వార్తలు

సినిమా వార్తలు ….

శ్రీలీలకు 4 కోట్లు రెమ్యూనరేషన్ …
ఒంటరిగా ఉండడం కష్టం.. కానీ అదే ఇష్టం అంటున్న సమంత
విలాసం కాదు… సౌకర్యం ముఖ్యమంటున్న రకుల్ ప్రీత్ సింగ్
Srileela remuneration for Bollywood movie

‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల జెడ్ స్పీడ్ తో పలు చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోల సరసన కూడా నటించింది. అయితే మధ్యలో కొన్ని ఫ్లాపులు రావడంతో ఆమె స్పీడ్ కొంచెం తగ్గింది. ‘పుష్ప 2’ సినిమాలోని ఐటెం సాంగ్ తో ఆమె మళ్లీ పుంజుకుంది. కొత్త ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి. తెలుగులో ఒక్కో సినిమాకు ఆమె రూ. 3 కోట్లు తీసుకుంటోందనే టాక్ ఉంది. 

తాజాగా శ్రీలీల ఒక బాలీవుడ్ మూవీ చేస్తోంది. అయితే ఈ సినిమాకు ఆమె కేవలం రూ. 1.75 కోట్లు మాత్రమే తీసుకుందట. బాలీవుడ్ లో తొలి సినిమా కాబట్టే ఆమె తక్కువ రెమ్యునరేషన్ కు ఒప్పుకుందని చెబుతున్నారు. మరోవైపు ‘చావా’ సినిమాకు రష్మిక మందన్న రూ. 4 కోట్లు తీసుకుందని టాక్. సౌత్ సినిమాల్లో కూడా ఆమె అంతే పారితోషికం అందుకుంటోంది.

విలాసం కాదు… సౌకర్యం ముఖ్యం: రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh on her marriage

సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లికి వచ్చిన అతిథులు సెల్ ఫోన్లు వెంట తీసుకురావద్దనే కండిషన్ పెట్టారు. ఈ అంశంపై తాజాగా ఓ ఇంటర్వూలో రకుల్ స్పందించారు. 

పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు వస్తాయనే భయంతో ఫోన్లను నిరాకరించామనే ప్రచారం జరిగిందని… అందులో వాస్తవం లేదని రకుల్ స్పష్టం చేశారు. వివాహ వేడుకను సింపుల్ గా జరపాలనుకున్నామని… అందుకే కొంతమంది సన్నిహితులను మాత్రమే పెళ్లికి ఆహ్వానించామని చెప్పారు. పెళ్లికి సంబంధించిన మధుర క్షణాలను అతిథులు కూడా ఆస్వాదించాలనే ఉద్దేశంతోనే ‘నో ఫోన్’ కండిషన్ పెట్టామని తెలిపారు. తన దృష్టిలో విలాసం కంటే సౌకర్యమే ముఖ్యమని అన్నారు. పెళ్లి తర్వాత ఫొటోలను తామే మీడియాకు విడుదల చేశామని తెలిపారు. సినిమాల విషయానికి వస్తే… రకుల్ తాజా చిత్రం ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ ఈ నెల 21వ విడుదల కానుంది. 

ఒంటరిగా ఉండడం కష్టం.. కానీ అదే ఇష్టం: సమంత

Samantha Ruth Prabhu Latest Post Viral
  • మూడు రోజులు మౌనంగా ఉన్నానంటూ ఇన్ స్టా పోస్ట్
  • రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ లో బిజీబిజీగా నటి
  • మళ్లీ యాక్షన్‌ మోడ్‌లోకి వచ్చేశానని వెల్లడి

ఒంటరితనం చాలా కష్టమని ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు చెప్పారు. అయితే, తాను మాత్రం ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతానని చెప్పుకొచ్చారు. మూడు రోజుల పాటు అందరికీ దూరంగా, ఒంటరిగా, మౌనంగా గడిపానని తెలిపారు. ఫోన్, సోషల్ మీడియా, షూటింగ్.. అన్నింటినీ పక్కన పెట్టి తనతో తాను మాత్రమే ఉన్నట్లు వివరించారు. మూడు రోజులు మాత్రమే కాదు ఎన్నిరోజులు ఉండమన్నా అలా ఉంటానని పేర్కొంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ‘మీరు కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించండి’ అంటూ తన అభిమానులకు సూచించారు. 

‘మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి. భయంకరమైనది. కానీ, ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్‌ సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను’ అంటూ పోస్టులో వెల్లడించారు. ఇటీవల సమంత నటించిన వెబ్ సిరీస్ ‘సిటడెల్: హనీ బన్నీ’ ఐకానిక్ గోల్డ్ అవార్డ్ తో పాటు ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డునూ గెలుచుకుంది. ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్న సమంత.. మరోపక్క రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇటీవలే షూటింగ్‌లో జాయిన్‌ అయ్యానని, మళ్లీ యాక్షన్‌ మోడ్‌లోకి వచ్చేశానంటూ సమంత సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Related posts

ఇన్‌స్టాలో కీలక వ్యాఖ్యలతో సమంత పోస్ట్

Ram Narayana

అల్లు అర్జున్.. మిమ్మ‌ల్ని చూస్తే గ‌ర్వంగా ఉంది: ప్ర‌కాశ్ రాజ్‌

Ram Narayana

ఆ సినిమా విషయంలో నాకు చెప్పిందొకటి .. చేసిందొకటి: భానుప్రియ!

Drukpadam