ఆంధ్రప్రదేశ్

పులివెందులలో రాజారెడ్డి కంటి ఆసుపత్రి ప్రారంభించిన జగన్!

  • ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ సహకారంతో కంటి ఆసుపత్రి విస్తరణ
  • ఆసుపత్రి ప్రారంభించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానన్న జగన్
  • ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకున్న జగన్
  • జగన్ కు ఎలాంటి కంటి సమస్యలు లేవన్న డాక్టర్

వైసీపీ అధినేత జగన్ నేడు సొంత నియోజవకర్గం పులివెందులలో పర్యటించారు. పులివెందులలో ఎల్వీ ప్రసాద్-వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రి ప్రారంభించిన సందర్భంగా జగన్ కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు కంటి సంబంధ సమస్యలేవీ లేవు డాక్టర్ నిర్ధారించారు. 

కాగా, పులివెందులలో ఇప్పటికే సేవలు అందిస్తున్న ఈ కంటి ఆసుపత్రిని మరింత విస్తరించారు. ఈ ఆసుపత్రి విస్తరణకు అవసరమైన స్థలాన్ని వైఎస్ రాజారెడ్డి ఫౌండేషన్ కేటాయించింది. అంతేగాకుండా, రూ.10 కోట్ల నిధులను కూడా సమకూర్చింది. దాంతో ఇక్కడ కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షల యంత్రం, 25 వార్డులను ఏర్పాటు చేశారు. రోజుకు 5 వేల కంటి ఆపరేషన్లు నిర్వహించేలా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేశారు. 

కాగా, ఎల్వీ ప్రసాద్-వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభోత్సవంపై జగన్ ట్వీట్ చేశారు. రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ప్రారంభించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ సహకారంతో ఈ ఆసుపత్రిని విస్తరించారని, ఇందులో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయని జగన్ వివరించారు. 

ఈ సందర్భంగా తన తండ్రి వైఎస్ స్మృతులు గుర్తుకొస్తున్నాయని, ఆయన కూడా పులివెందుల ఆసుపత్రిలో ప్రముఖ వైద్యుడిగా సేవలు అందించారని జగన్ పేర్కొన్నారు.

Related posts

విజయవాడలో ‘నారీ శక్తి విజయోత్సవం’ కార్యక్రమానికి హాజరైన నారా భువనేశ్వరి!

Ram Narayana

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు… సీఎం చంద్రబాబు

Ram Narayana

భూ సమస్యలపై చంద్రబాబు ఆగ్రహం .. రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి

Ram Narayana