తీర్థాల సంగమేశ్వరస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ప్రత్యేక పూజలు …దేవుని ఆశ్వీర్వాదం తీసుకున్న కలెక్టర్
కలెక్టర్ ను సన్మానించిన ఆలయ కమిటీ
అనంతరం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్ని మతాల సారాంశం ఒకేటే అనే విధంగా శివరాత్రి సందర్భంగా ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల సంగమేశ్వరస్వామిని సందర్శించుకొని ప్రత్యేక పూజలు చేసేశారు …అంతే కాదు తన ముఖంపై స్వామి వారి విభూదిని పెట్టుకొని దాన్ని వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అందని ఆశ్చర్యపరిచారు…ఇప్పటికే జిల్లా ప్రజల హృదయాల్లో మంచి పేరు తెచ్చుకున్న కలెక్టర్ హిందూ దేవాలయంలో పూజలు చేసుకోవడం పై షహబాష్ కలెక్టర్ అంటున్నారు ప్రజలు …


అక్కడ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి – జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.
గురువారం జిల్లా కలెక్టర్, ఖమ్మం రూరల్ మండలం తీర్దాల సంగమేశ్వర స్వామి ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, స్వామి వారి చల్లని దీవెనలు భక్తులందరిపై ఉండాలని, జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
దర్శనానంతరం భక్తులతో ఆలయం వద్ద, జాతర సందర్భంగా చేసిన ఏర్పాట్లు ఎలా వున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
అనంతరం ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, అర్చకులు జిల్లా కలెక్టర్ ను శాలువాతో సత్కరించి, ప్రసాదం అందజేశారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
