- మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- కేరళలోని కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలని అధికారులకు సూచన
- భూసేకరణ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశం
కేరళలోని కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు విమానాశ్రయం ఉండాలని, నిత్యం కార్యకలాపాలు కొనసాగేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వం మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి అనుమతి తెలిపిన నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భూసేకరణ, పెండింగ్ పనుల వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పనులకు సంబంధించి ప్రతి నెలా నివేదికను అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీహరి, ప్రకాశ్ రెడ్డి, నాగరాజు, మేయర్ సుధారాణి, సలహాదారు వేం సురేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.