ఉత్కంఠ భరితంగా సాగిన నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు … హోరాహోరీగా నడిచిన కౌంటింగ్ లో విజయం పీఆర్టీయూ కు చెందిన శ్రీపాల్ రెడ్డి ని వరించింది.
నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ నుండి మల్కా కొమురయ్య గెలుపు
నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గెలుపు
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ నుండి మల్కా కొమురయ్య విజయం
మల్కా కొమురయ్యకు మద్దతు పలికిన బీజేపీ
తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ, బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎన్నికల్లో మల్కా కొమురయ్య విజయం సాధించారు. మల్కా కొమురయ్యకు బీజేపీ మద్దతు పలికింది.
శ్రీపాల్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు.
బీజేపీ మద్దతు పలికిన మల్కా కొమురయ్యకు 12,959 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఆయన పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. విజయం సాధించేందుకు 12,081 ఓట్లుగా అధికారులు నిర్ధారించారు. మల్కా కొమురయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి.
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపు

ముగిసిన ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
రెండో ప్రాధాన్యత ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ సాధించిన శ్రీనివాసులు నాయుడు
తాము రఘువర్మ, శ్రీనివాసులునాయుడు ఇద్దరికీ మద్ధతిచ్చామన్న అచ్చెన్నాయుడు
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ ఓటమిపాలయ్యారు. గాదె శ్రీనివాసులు నాయుడు కౌంటింగ్ తొలి రౌండ్ నుంచి ముందంజలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి 10 మంది పోటీ చేయగా, ఎలిమినేషన్ లో 8 మంది పోటీ నుంచి నిష్క్రమించారు. చివరికి శ్రీనివాసలు నాయుడు, రఘువర్మ మిగలగా… రెండో ప్రాధాన్యత ఓట్ల సాయంతో శ్రీనివాసులు నాయుడు మ్యాజిక్ ఫిగర్ (10,068) సాధించి విజయం అందుకున్నారు.
వైసీపీపై మండిపడిన అచ్చెన్నాయుడు
కాగా, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాముసీఎం చంద్రబాబు సూచన మేరకు నడుచుకున్నామని… తొలి ప్రాధాన్యత ఓటు రఘువర్మకు, రెండో ప్రాధాన్యత ఓటు శ్రీనివాసులు నాయుడుకు వేయాలని చంద్రబాబు సూచించారని వివరించారు. టీడీపీ రఘువర్మ, శ్రీనివాసులు నాయుడు ఇద్దరినీ బలపరిచిందని స్పష్టం చేశారు.
కానీ వైసీపీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ ముసుగులో పోటీ పెట్టిందని విమర్శించారు. అటు పట్టభద్రుల ఎన్నికల్లో పీడీఎఫ్ ముసుగులో నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు.