- మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం
- 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆడిన వేలాది మంది క్రికెటర్లు
- ఆరంభ సీజన్ నుంచి రాబోయే ఎడిషన్‌లో కూడా ఆడనున్న 8 మంది ప్లేయర్లు
- ఈ జాబితాలో ధోనీ, రోహిత్, కోహ్లీ తదితరులు
మరో రెండు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నెల 22న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య జరిగే ఆరంభ మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే, 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో ఇప్పటివరకు వేలాది మంది క్రికెటర్లు ఆడారు.
కానీ, కొందరు మాత్రమే ఆరంభ సీజన్ నుంచి రాబోయే 18వ ఎడిషన్‌లో కూడా ఆడనున్నారు. వీరిలో 1.మహేంద్ర సింగ్ ధోనీ (చెన్నై సూపర్ కింగ్), 2. రవీంద్ర జడేజా (రాజస్థాన్ తరఫున అరంగేట్రం.. ఇప్పుడు సీఎస్‌కేకు ప్రాతినిధ్యం), 3. రవిచంద్రన్ అశ్వీన్ (చెన్నై సూపర్ కింగ్), 4. ఇషాంత్ శర్మ(కోల్‌కతా తరఫున అరంగేట్రం.. ఇప్పుడు గుజరాత్‌కు ప్రాతినిధ్యం), 5. అజింక్య రహానె (ప్రారంభ సీజన్‌లో ముంబయికి ప్రాతినిధ్యం.. ఇప్పుడు కేకేఆర్ కెప్టెన్), 6. మనీశ్ పాండే (ప్రారంభ సీజన్‌లో ముంబయి తరఫున అరంగేట్రం.. ఇప్పుడు కేకేఆర్ కు ప్రాతినిధ్యం), 7. రోహిత్ శర్మ (2008లో డెక్కన్ ఛార్జర్స్‌కు ప్రాతినిధ్యం.. ఇప్పుడు ముంబయి ఇండియన్స్), 8. విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు).