కేసీఆర్ ను ఉద్దేశించి ఈటల లేఖ … ఇది తప్పుడు ప్రచారం అంటున్న ఈటల మద్దతు దార్లు
-కేసీఆర్‌కు ఈటల లేఖ కలకలం పై పలు స్టేషన్ లలో పోలీసులకు ఫిర్యాదు
-కరీంనగర్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో బీజేపీ నేతల ఫిర్యాదు
-ఈటల ఎప్పుడూ తెలుగులో రాయలేదన్న మద్దతుదారులు
-లెటర్ రాసిన వారిపైనా, వైరల్ చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్
బీజేపీ నేత ఈటల రాజేందర్ మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ అవడానికి ముందు ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను ఉద్దేశించి రాసినట్లుగా చెబుతున్న లేఖ ఒకటి సోషియల్ మీడియా లో హల్చల్ చేస్తున్నది … ఇది ఈటల రాసింది కాదని ఈటల వర్గం నేతలు లేఖ సృష్టి కర్తలపై మండి పడుతున్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జైళ్లలో పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు సైతం చేశారు. కావాలని ఈటల ప్రతిష్టను దెబ్బతీయడానికి నకిలీ లెటర్ సృష్టించారని ,ఇది ముమ్మాటికీ కుట్రలో భాగమేనని అంటున్నారు. అసలు ఈటల ఎప్పుడు లెటర్ తెలుగు రాయలేదని అంటున్నారు . అచ్చం ఆయన భాషను ఉపయోగించి రాసిన ఈ లెటర్ వత్తిడి నిజామా అనేది విచారణలో తేలుతుందేమో చూడాలి ….
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అవడానికి ముందు తనపై వచ్చిన అభియోగాలకు సంజాయిషీ ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ మంత్రి ఈటల రాసినట్టుగా చెబుతున్న లేఖ నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్పందించిన ఈటల వర్గీయులైన బీజేపీ నేతలు దీనిని కొట్టిపడేశారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిని ఉద్దేశపూర్వకంగా పుట్టించారంటూ కరీంనగర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈటలను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ లేఖను రూపొందించిన వారితోపాటు దానిని వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీణవంక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చశారు. ఈటల ఎప్పుడూ తన లెటర్ ప్యాడ్‌పై తెలుగులో ఏ విషయాన్నీ రాయలేదని అందులో పేర్కొన్నారు.
ఈటల లేఖ కలకలం రేపుతోంది. … నిజంగా లేఖ రాస్తే కేసీఆర్ కనికరించలేదా…. దీనిపై కనీసం మాట్లాడకుండా ఎందుకు నిరాకరించారు ? ఒక వేళ భూకబ్జాలపై కఠినంగా ఉంటె మిగతా వారి విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఈటల పార్టీలో, ప్రభుత్వం లో కొరకరాని కొయ్యగా ఎందుకు తయారు అయ్యారు??? ఈటల మాటలే అందుకు కారణమా ???? అనే విషయాలపై మరింత ఆశక్తి నెలకొన్నది …..