- నాగర్‌కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో ఘటన
- ఆంజనేయస్వామి ఆలయంలో మొక్కులు తీర్చుకొనేందుకు మహబూబ్‌నగర్ నుంచి వచ్చిన బాధిత యువతి
- యువతి బంధువుపై దాడిచేసి కాళ్లు చేతులు కట్టేసిన 8 మంది నిందితులు
- ఆపై యువతిని గుట్టల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం
తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో దారుణం జరిగింది. ఆంజనేయస్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. పోలీసుల కథనం ప్రకారం… మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యువతి శనివారం సాయంత్రం బంధువుతో కలిసి ఊర్కొండపేటలోని ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చింది. దైవదర్శనం అనంతరం రాత్రి అక్కడే నిద్రపోవాలని అనుకున్నారు.
ఈ క్రమంలో కాలకృత్యాల కోసం సమీపంలోని గుట్టప్రాంతంలోకి వెళ్గగా అప్పటికే అక్కడ ఉన్న 8 మంది యువకులు యువతిని అడ్డుకున్నారు. ఆమె వెంట వచ్చిన బంధువుపై దాడిచేసి చేతులు కట్టేశారు. ఆపై యువతిని బలవంతంగా సమీపంలోని గుట్టల్లోకి తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితులను ఊర్కొండపేటకు చెందినవారిగా గుర్తించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.