అంతర్జాతీయం

చైనీయులతో ప్రేమ‌, పెళ్లి, శారీరక సంబంధాలు వద్దు: అమెరికా

  • చైనాలోని త‌మ ఉద్యోగులకు అమెరికా ఆదేశాలు
  • చైనాలో అమెరికా మిషన్‌ కోసం పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు, కాంట్రాక్టర్లకు వ‌ర్తింపు
  • నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే విధుల నుంచి తొల‌గిస్తామ‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌

చైనీయుల‌తో ప్రేమ, పెళ్లి, శారీర‌క‌ సంబంధాలు ఏర్ప‌రుచుకోవ‌ద్ద‌ని అమెరికా చైనాలోని త‌మ‌ ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని హెచ్చ‌రించింది. చైనాలో అమెరికా మిషన్‌ కోసం పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు, కాంట్రాక్టర్లు, భద్రతాపరమైన అనుమతులున్న కుటుంబ సభ్యుల‌కు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిని విధుల నుంచి తొల‌గిస్తామ‌ని తేల్చి చెప్పింది. 

కాగా, చైనాలో అమెరికా రాయబారి నికోలస్‌ బర్న్స్‌ ఈ ఏడాది జనవరిలో తన బాధ్యతల నుంచి వైదొలగిన వెంటనే ఈ ఆదేశాలు వెలువ‌డ్డాయి. 

Related posts

శాంతి దిశగా అడుగులు: జెలెన్‌స్కీకి రష్యా ఆహ్వానం.. రంగంలోకి ట్రంప్…

Ram Narayana

సైన్యాధ్యక్షుడికే సర్వాధికారాలు.. పాక్‌లో సైనిక పెత్తనానికి చట్టబద్ధత…

Ram Narayana

వెనెజువెలా మరో ఇరాక్ కాకూడదనే..!: మీడియాకు వివరించి చెప్పిన ట్రంప్

Ram Narayana