సిపిఎం ఖమ్మంజిల్లా నాయకులు యర్రా శ్రీకాంత్ మధురై లో హఠాన్మరణం …
ఈనెల 2 -6 తేదీల మధ్య మదురై లో జరిగిన సిపిఎం జాతీయ సభలకు ప్రతినిధిగా శ్రీకాంత్
చివరి రోజున మరి కొన్ని గంటల్లో తిరుగు ప్రయాణ అవుతాననగా గుండెపోటు
హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ల వెల్లడి

సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఖమ్మం నగరానికి చెందిన యర్రా శ్రీకాంత్ తమిళనాడులోని మధురై లో హఠాన్మరణం చెందారు …మదురై లో 2 -6 తేదీలలో జరిగిన అఖిలభారత సిపిఎం 24 వ మహాసభల్లో తెలంగాణ నుంచి ప్రతిదిగా ఎన్నికై సభలకు వెళ్లారు …నాలుగు రోజులపాటు సభల్లో చురుగ్గా పాల్గొన్నారు … అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన కామ్రేడ్స్ ఆయన్ను మదురైలోని అపోలో హాస్పిటల్ కు తరలించారు …అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు ..మరి కొద్దీ గంటల్లో మహాసభలు ముగిసి ఇంటికి తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంలో శ్రీకాంత్ మృతి ప్రతిధులను షాక్ కు గురిచేసింది … ఆయన భౌతిక ఖాయాన్ని మదురై నుంచి ఖమ్మం కు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం….
శ్రీకాంత్ ఎర్రజెండా భుజాన వేసుకొని ఖమ్మం నగరంలోని పార్టీ నిర్మాణంలో కార్మిక ఉద్యమాల నిర్మాణంలో , పేదలకు ఇళ్లస్థలాల సాధనలో అనేక పోరాటాలు నిర్వహించారు …రెండు సార్లు ఆమరణ దీక్షలో పాల్గొన్నారు …పేదలకు ఏ ఆపద వచ్చిన నేనున్నాను అంటూ ముందు పీఠిన నిలబడ్డారు …పోలీస్ కేసులు లాఠీ దెబ్బలు ,అరెస్టులు , జైలు జీవితాలను అనుభవించారు … పార్టీలో పూర్తీ టైం కార్యకర్తగా తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీకాంత్ మరణం సిపిఎం పార్టీకి పీడిత ఉద్యమాలకు తీరని లోటు ..
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ మృత దేహాన్ని సందర్శించి జెండా కప్పి నివాళులు అర్పించిన తమ్మినేని, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ..

సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు మరియు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ యర్రా శ్రీకాంత్ (62 సం.లు) ఈరోజు అనగా ఆదివారం మధ్యాహ్నం తీవ్రమైన గుండెపోటుతో మధురైలో మరణించారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే పార్టీ కేంద్ర కమిటి సభ్యులు తమ్మినేని వీరభద్రం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.సుదర్శన్‌రావు మధురైలోని అపోలో హాస్పిటల్‌కి వెళ్ళి యర్రా శ్రీకాంత్ మృత దేహాన్ని సందర్శించి, పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు.
శ్రీకాంత్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో పార్టీ కేంద్ర కమిటి సభ్యులు ఎం.సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జ్యోతి, బండారు రవికుమార్, పాలడుగు భాస్కర్, ఎం.డి.జహంగీర్, రాష్ట్ర కంట్రోల్ కమీషన్ చైర్మన్ డి.జి.నర్సింహారావు, రాష్ట్ర కమిటి సభ్యులు మాదాల భారతి, సుధాకర్‌రెడ్డి, నల్గొండ జిల్లా సెక్రటరీ వీరారెడ్డి, సూర్యాపేట జిల్లా సెక్రటరీ నాగార్జునరెడ్డి, సిద్దిపేట జిల్లా కార్యదదర్శి మల్లారెడ్డి, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, కొత్తగూడెం జిల్లా కార్యదదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, నవ తెలంగాణ ఖమ్మం జిల్లా మేనేజర్ ఎస్.డి.జావీద్, ఖమ్మం జిల్లా నాయకులు దొంగల తిరుపతిరావు, నవీన్‌రెడ్డి, మడుపల్లి గోపాల్‌రావు, వూరడి సుదర్శన్‌రెడ్డి, నండ్ర ప్రసాద్, సీనియర్ నాయకులు చింతలచెర్వు కోటేశ్వరరావు, బోనకల్ పార్టీ కార్యదర్శి కిలారు సురేష్ తదితరులు వున్నారు.
శ్రీకాంత్ ఆకస్మిక మరణానికి సిపిఎం ఖమ్మం జిల్లా కమిటి సంతాపం
సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు మరియు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ యర్రా శ్రీకాంత్ (62 సం.లు) ఈరోజు అనగా ఆదివారం మధ్యాహ్నం తీవ్రమైన గుండెపోటుతో మధురైలో మరణించారు. పార్టీ అఖిల భారత మహాసభలలో పాల్గొనేందుకు ప్రతినిధిగా వెళ్ళిన శ్రీకాంత్ నిన్న మధ్యాహ్నం అస్వస్థతకు గురి కావడంతో మధురైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ రోజు ఆదివారం మధ్యాహ్నం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆకస్మికంగా మరణించారు. వారి మరణం పార్టీకి తీరని లోటు. కామ్రేడ్ శ్రీకాంత్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. శ్రీకాంత్ ఖమ్మం పట్టణంలో ఒక సాధారణ కార్మిక కుటుంబంలో జన్మించి విద్యార్థి దశలో ఎస్.ఎఫ్.ఐ. వైపు ఆకర్షితుడై విద్యార్థి, యువజన ఉద్యమాలలో చురుకుగా పాల్గొని కీలక పాత్ర పోషించారు. గత 37 సం.లుగా కార్మికోద్యమంలో పనిచేస్తూ అనేక ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఇంటర్మీడియెట్ వరకు చదివిన శ్రీకాంత్ 1980 సం.లో సిపిఎం పార్టీలో చేరి 1991 నుండి పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తున్నారు. శ్రీకాంత్ సతీమణి యర్రా సుకన్య కూడా ఖమ్మం పట్టణ ఐద్వా నాయకురాలిగా పనిచేస్తున్నారు. రెండు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికై భర్త బాటలో ప్రజా సేవలో ఉన్నారు.
పార్టీలో బాధ్యతలు : కామ్రేడ్ శ్రీకాంత్ 1982`84 వరకు ఎస్.ఎఫ్.ఐ.లో, 1991 నుండి సి.పి.ఎం. పూర్తికాలం కార్యకర్తగా, 1995లో సి.ఐ.టి.యు. ఖమ్మం పట్టణ కార్యదర్శిగా, 2002లో పార్టీ ఖమ్మం టౌన్ కార్యదర్శిగా, 2009లో పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2011లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నికై నేటికీ కొనసాగుతున్నారు. 2019లో పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులుగా మొదటిసారిగా తీసుకున్నారు. తిరిగి 2021, 2025 సం.లలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో కూడా రాష్ట్ర కమిటి సభ్యులుగా ఎన్నికైనారు.
ఉద్యమ నేపథ్యం : 14 సం.ల వయసులోనే ఉద్యమంలోకి రావడం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వ కాలంలో అసంఘటితరంగ కార్మికులు 1300 మందిని సమీకరించి దీర్ఘకాలిక పోరాటం చేయటంవల్ల పి.ఎఫ్.లు, ఇతర సౌకర్యాలు సాధించటం జరిగింది. 2000 సం.లో జరిగిన విద్యుత్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఖమ్మం గ్రైన్‌మార్కెట్‌లో కార్మికులను ఏకంచేయడంతోపాటు, వేతనాలు, ఇతర సమస్యలపై పోరాటాలు నిర్వహించి ఫలితాలు సాధించారు. పట్టణ ఇళ్ళ స్థలాల సమస్యపై 10 సం.లపాటు జరిగిన సుదీర్ఘపోరాటానికి నాయకత్వం వహించటం జరిగింది. పట్టణ పేదలకు వెంకటగిరి, కోటనారాయణపురం, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాలు, ఇళ్ల సి.పి.ఎం. పోరాట ఫలితంగా వచ్చాయి. ఆ పోరాటాలన్నింటిలో శ్రీకాంత్ పాల్గొన్నారు. 2007 భూపోరాటం, 2004లో ఖమ్మం ఎం.ఆర్.ఓ. కార్యాలయం ఎదురుగా జరిగిన 9 రోజుల ఆమరణ దీక్షలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం ముందు ఇండ్ల స్థలాల కోసం 5 రోజుల పాటు దీక్షలో పాల్గొన్నారు. విద్యుత్ పోరాటంలో 21 రోజులు జైలు జీవితం గడిపారు. గ్రైన్ మార్కెట్ తరలింపును వ్యతిరేకిస్తూ అన్ని వర్గాలవారిని కలుపుకొని పోరాటాలు నిర్వహించడం ద్వారా మార్కెట్ తరలింపును తాత్కాలికంగా నిలుపుదలచేయడం జరిగింది. పట్టణంలో పార్టీ విస్తరణ, నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు.
శ్రీకాంత్ మరణం పార్టీకి, ప్రజా సంఘాలకు తీరని లోటని, ఆయన మరణానికి సంతాపం, కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నట్లు నున్నా తెలిపారు.
యర్రా శ్రీకాంత్ మృతి పట్ల మాజీ ఎంపి నామ విచారం
ఖమ్మం జిల్లా సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు యర్రా శ్రీకాంత్ ఆకస్మిక మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. యర్రా శ్రీకాంత్ మరణ వార్త తెలసిన నామ ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తన రాజకీయ జీవితంలో క్రమశిక్షణ, నిబద్ధతతో ముందుకెళ్లిన నాయకుడు శ్రీకాంత్ అని నామ పేర్కొన్నారు. సీపీఎం సిద్ధాంతాలకు అంకితభావంగా పని చేస్తూ ఖమ్మం త్రీ టౌన్ ప్రజల సమస్యలపై పోరాడుతూ, వాటి పరిష్కారానికి ఎప్పుడు ముందు వుండేవారు అని తెలిపారు. శ్రీకాంత్ మరణం బాధాకరమని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
కాపు సంఘం సంతాపం ..
సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు…ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు…
శ్రీ ఎర్ర శ్రీకాంత్ గుండెపోటుతో ఆకస్మిక మృతి పట్ల మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి కాంగ్రెస్ జిల్లా నాయకులు శెట్టి రంగారావు, తాళ్లూరి హనుమంత రావు, కల్లూరి సోమనాథo, కనిశెట్టి నరసయ్య, పసుపులేటి దేవేంద్రo, పొదిల రవి కుమార్, ఆళ్ల కృష,గొట్టం శ్రీనివాస్ రావు, పగడాల మంజుల, సముద్రాల శ్రీనివాస్, మడూరి పూర్ణ,గుండ్లపల్లి శేషగిరిరావు రావు మాటేటి రవి, గడీల నరసింహారావు, Ex Dsp నర్సయ్య, తదితరులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేయడం జరిగింది..