Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమెరికా నూతన అధ్యక్షుడు జో బిడెన్ కు ప్రాణహాని

అమెరికా నూతన అధ్యక్షుడు జో బిడెన్ కు ప్రాణహాని
అమెరికా నూతన అధ్యక్షుడు జోబిడెన్ కు ప్రాణహాని ఉందా? అంటే ఉందని అంటున్నాయి ఆదేశ ఇంటలిజెన్స్ వర్గాలు. దీంతో దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ లో కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు .నగరం మొత్తాన్ని కొంటోన్మెంట్ జోన్ గా మార్చివేశారు.25 వేలమంది జాతీయ గార్డులతో పాటు స్థానిక పోలీసులు వాషింగ్టన్ నగరాన్ని అష్ట దిగ్బంధనం చేశారు. బిడెన్ కు ఆయన రక్షణ సిబ్బంది నుంచే ప్రాణహాని ఉందని సమాచారం ఉండటంతో అందరిని నిశితంగా తనిఖీ చేస్తున్నారు . రక్షణ సిబ్బందితో ప్రత్యేకమైన సమావేశం వేర్పాటు చేశారు. రక్షణ విధులకు హాజరయ్యే సిబ్బందిని నిశితంగా తనిఖీ చేయటంతో పాటు అధికారులను అప్రమత్తం చేశారు. ఏవిధమైన అల్లర్లు జరగకుండా ,దాడులు జరగకుండా , రక్షణ శాఖా కార్యదర్శిని అలర్ట్ చేశారు. ప్రమాణ స్వీకారం జరిగే ప్రాంతంలో అనుమానితులను పోలీసులకు అప్పగించాలని విజ్ఞపి చేశారు.ట్రంప్ అభిమానులు ,శ్వేతా జాతి అహంకార వాదులు , ఉగ్రవాదులు దాడులు జరిపి ఆవకాశం ఉన్నట్లు సమాచారం ఉండటంతో రక్షణ అధికారులంతా అప్రమత్తం అయ్యారు. జనవరి 8 వ తేదీన అల్లర్లు జరిగిన కాపిటల్ భవనం వెలుపలనే జోబిడెన్ , కమల హారిసన్ ప్రమాణ స్వీకారానికి అధికారులు వేర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక దేశ అధ్యక్షుడు పై హత్యయత్నం జరగ వచ్చునని వస్తున్నా వార్తల పట్ల యావత్ ప్రపంచం ఆందోళన చెందుతుంది . నవంబర్ 3 న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాట్ పార్టీకి చెందిన జోబిడెన్ ,దిగిపోతున్న అధ్యక్షడు ట్రంప్ పై ఘన విజయం సాధించారు . తన ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్ అమెరికాలోని తన మద్దతు దార్లను రెచ్చగొట్టాడు .దీంతో ఎన్నికలలో గెలుపొందిన వారిని గుర్తించి ధృవీకరించే సమావేశం జరుగుతున్న కాపిటల్ భవనం పై వేలాది మంది ట్రంప్ మద్దతు దార్లు దాడిచేసి హింస కాండకు పాల్పడ్డారు. ఈ దాడి ప్రత్యక్షంగా తిలికించిన ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకున్నాయి. ట్రంప్ తన సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదుర్కొన్నారు. రిపబ్లికన్లు సైతం కాపిటల్ భవనం పై దాడిని తీవ్రంగా ఖండించారు . ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న అమెరికాలో జరిగిన సంఘటనలపై ప్రపంచం నివ్వర పోయింది . దీంతో అమెరికా రక్షణ అధికారులు ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఆటంకం కలగకుండా తగిన రక్షణ ఏర్పాట్లను చేపట్టారు. ప్రమాణ స్వీకారానికి ట్రంప్ దూరంగా ఉంటున్నారు. పలువురు మాజీ అధ్యక్షలుకు ఆహ్వానాలు పంపారు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్ ఈ కార్యక్రమానికి వస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరికొందరు కూడా వస్తారని వారికోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం సాఫీగా జరగాలని మనం కోరుకుందాం !!!

Related posts

బిగ్ బాస్ పై కంటెస్టెంట్ విమర్శలు …తనకు అన్యాయం జరిగిందని ఆరోపణలు !

Drukpadam

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆ మొత్తం రిఫండ్!

Drukpadam

‘అగ్నిపథ్’ నిరసనలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలుకు నిప్పు

Drukpadam

Leave a Comment