- నిందితులు ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసిన కోర్టు
- ఎన్ఐఏ తీర్పును సమర్థించిన హైకోర్టు
- 2013లో దిల్ సుఖ్ నగర్ లో జంట పేలుళ్లు.. 18 మంది మృతి
హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో పేలుళ్లకు పాల్పడిన నిందితులకు ఉరిశిక్షే సరైందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించింది. పేలుళ్లకు పాల్పడి అమాయకుల ప్రాణాలు తీసిన నిందితులు అక్తర్, జియా ఉర్ రహమాన్, యాసిన్ భత్కల్, తహసీన్ అక్తర్, అజాజ్ షేక్ లకు ఉరిశిక్ష విధించింది.
బాంబు పేలుళ్లలో 18 మంది మృతి
2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బస్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల వ్యవధిలోనే రెండు పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబ్ పేలగా.. అక్కడికి 150 మీటర్ల దూరంలో మరో బ్లాస్ట్ సంభవించింది. ఉగ్రవాదులు టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి ఈ దాడికి పాల్పడ్డారు. దీంతో 18 మంది మరణించగా, మరో 130 మంది గాయపడ్డారు. ఈ కేసును దర్యాప్తు చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ).. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన యాసిన్ భత్కల్ ను ప్రధాన నిందితుడిగా తేల్చింది.
మరో ఐదుగురు ఉగ్రవాదులకు ఈ పేలుళ్లతో సంబంధం ఉందని నిర్ధారించి వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టింది. సుదీర్ఘ విచారణ తర్వాత నిందితులు ఐదుగురికి ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పుపై నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు.
దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2016లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విధించిన తీర్పును సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ప్రత్యేక కోర్టు తీర్పును సవాలు చేస్తూ దోషులు దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జంట బాంబు పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మందికి గాయాలయ్యాయి. ఐదుగురు దోషులు ప్రస్తుతం తీహాడ్ జైలులో ఉండగా ప్రధాన సూత్రధారి రియాజ్ బక్తల్ ఇంకా పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నాడు.

అసలేం జరిగింది? :
2013లో హైదరాబాద్‌తో పాటు దేశ ప్రజలను ఉలిక్కి పడేలా చేసిన దిల్‌సుఖ్‌నగర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భాగ్యనగర చరిత్రలో మానని గాయంగా మిగిలిన ఘటనలో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధించింది. 2013 ఫిబ్రవరి 21న జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మందికి గాయాలయ్యాయి. 2015లో విచారణ ప్రారంభించిన ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం 157 మంది సాక్షులను ప్రశ్నించింది. 2016లో ఐదుగురిని దోషులుగా నిర్ధారిస్తూ ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దోషులు హైకోర్టులో క్రిమినల్ అప్పీల్ దాఖలు చేశారు. జస్టిస్ కే.లక్ష్మణ్, జస్టిస్ పీ.శ్రీసుధలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం 45 రోజుల పాటు విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. దోషులు దాఖలు చేసిన అప్పీలును కొట్టి వేసింది.
పాకిస్థాన్‌లో తలదాచుకున్నకీలక సూత్రధారి : 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని బస్టాప్ వద్ద రాత్రి 7 గంటల సమయంలో మొదటి పేలుడు జరిగింది. క్షణాల వ్యవధిలోనే కోణార్క్ థియేటర్ సమీపంలోని ఏ-1 మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా రక్తమోడుతూ భీతావహంగా మారగా ఓ మహిళతో పాటు ఆమె గర్భంలో ఉన్న శిశువు సైతం గాయాలపాలవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. ఘటనపై తొలుత కేసు నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు అదే ఏడాది మార్చి 13న ఎన్ఐఏకు బదిలీ చేశారు. ఇండియన్ ముజహిద్దీన్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో గుర్తించింది. యాసిన్ బత్కల్, అబ్దుల్లా అక్తర్‌లను 2013లోనే ఇండో నేపాల్ సరిహద్దు వద్ద అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా బిహార్‌కు చెందిన తహసీన్ అక్తర్, పాకిస్థాన్‌కు చెందిన జియా ఉర్ రెహమాన్‌లను 2014 మేలో రాజస్థాన్‌లో అరెస్ట్ చేశారు. వీరితో పాటు పుణేకి చెందిన అజీజ్ షేక్‌ను సైతం ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. పేలుళ్లకు కీలక సూత్రధారి మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బక్తల్ విచారణలో గుర్తించారు. రియాజ్ బక్తల్ పాకిస్థాన్‌లో తలదాచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. కేసులో దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు 5 వేల పేజీలతో అభియోగ పత్రం దాఖలు చేశారు. 2015లో విచారణ ప్రారంభించిన ప్రత్యేక న్యాయస్థానం 157 సాక్షులను ప్రశ్నించింది. అన్నింటిని పరిగణలోకి తీసుకున్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2016 డిసెంబర్ 13న ఐదుగురిని దోషులుగా తేల్చింది. అతి అరుదైన కేసుగా భావించిన న్యాయస్థానం అదే నెల 19న మరణశిక్ష ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఐదుగురు దోషులు 2016 డిసెంబర్‌లో హైకోర్టును ఆశ్రయించారు. తీర్పును రద్దు చేయాలంటూ క్రిమినల్ అప్పీల్ దాఖలు చేశారు. జస్టిస్ కే.లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం అప్పీలుపై విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. ఐదుగురు నిందితులు ప్రస్తుతం తీహాడ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని అజాజ్ షేక్ తరఫు న్యాయవాది తెలిపారు. హైకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించిందని ఎన్ఐఏ తరపు న్యాయవాది వెల్లడించారు.