WAQF
జాతీయ వార్తలు

వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది

  • రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల

వక్ఫ్ సవరణ చట్టం-2025 అమల్లోకి తీసుకు వస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారింది.ఈ చట్టాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు కేంద్రం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరోవైపు, ఈ వక్ఫ్ చట్టంపై కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల ఎంపీలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మొత్తం 15 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది. ముందుగా కేంద్ర ప్రభుత్వం కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎటువంటి ఆదేశాలు జారీ చేయవద్దని సుప్రీంకోర్టును కోరింది.

Related posts

ఒడిశా గవర్నర్ గా కంభంపాటి హరిబాబు…

Ram Narayana

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి: శశిథరూర్…

Drukpadam

రైలు ప్రయాణికులకు అదిరిపోయే సదుపాయం… ఇక ప్రయాణ తేదీ మార్చుకోవచ్చు!

Ram Narayana