BRS Rajatotsavam
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఎట్టకేలకు బీఆర్ఎస్ సభకు అనుమతి

నాటకీయ పరిణామాల మధ్య భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవ సభకు పోలీసుల శనివారం అనుమతినిచ్చారు. వరంగల్ కమిషనరేట్ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ సీనియర్ నేతలు పెద్ది మదుసూధన్ రెడ్డి, వినయ్ భాస్కర్ దీనికి సంబంధించిన అనుమతి పత్రాలను తీసుకున్నారు. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ నిర్వహించనున్న ఈ సభకు మొదట పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఒక వైపు  కోర్టులో విచారణ జరుగుతుండగానే పోలీసులు అనుమతినిచ్చారు. దీంతో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను బీఆర్ఎస్ నేతలు ఉపసంహరించుకోనున్నారు.

Related posts

బీఆర్ యస్ తప్పిదం…అనివార్యంగా కాంగ్రెసులోకి తుమ్మల…? పాలేరు నుంచే పోటీ …!

Ram Narayana

రేవంత్ రెడ్డికి ఐదేళ్లు ఢోకా లేదు…జగ్గారెడ్డి

Ram Narayana

కమ్మసామాజికవర్గానికి కాంగ్రెస్ అన్యాయం …రేణుక చౌదరి ఆగ్రహం …

Ram Narayana