- జగన్నాథుడి జెండా ఎత్తుకెళ్లిన గద్ద.. వీడియో ఇదిగో!
- సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టిన భక్తులు
- ఆలయ దర్శనంలో తొలుత జెండాకు భక్తుల మొక్కులు
పూరీ జగన్నాథ ఆలయంలో ఆదివారం ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. ఆలయ శిఖరంపై ఎగురవేసే జగన్నాథుడి పవిత్ర జెండాను ఓ గద్ద ఎత్తుకెళ్లింది. జెండాను తన నోట కరిచి ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టింది. ఇది చూసిన భక్తులు ఆశ్చర్యంతోపాటు విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది భక్తులు ఈ ఘటనను తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
జగన్నాథుడి దర్శనం కోసం పూరీ వచ్చే భక్తులు తొలుత ఈ పతితపావన జెండాకు నమస్కరించుకుంటారు. ఆపై ఆలయంలోకి వెళ్లి జగన్నాథుడి దర్శనం చేసుకుంటారు. ఆలయ శిఖరంపై ఎగురవేసే 14 మూరల పతాకాన్ని అర్చకులు ప్రతిరోజూ మారుస్తారు. సాయంత్రం 5 గంటలకు కొత్త జెండా ఎగురవేస్తారు. భక్తులు సమర్పించే జెండాలను చక్రం దిగువన కడతారు.