Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

‘నిన్ను ఇంట్లోనే చంపుతాం’… స‌ల్లూ భాయ్‌కి మ‌రోసారి బెదిరింపులు!

  • ముంబయిలోని వర్లి రవాణా శాఖ వాట్సాప్ నంబర్‌కు సందేశం 
  • ఇంట్లోనే చంపుతాం లేదా కారులో బాంబు పెట్టి పేల్చేస్తామ‌ని ఆగంత‌కుల మేసేజ్‌
  • ద‌ర్యాప్తు చేప‌ట్టిన వ‌ర్లి పోలీసులు

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్‌కు మ‌రోసారి తీవ్ర బెదిరింపులు వ‌చ్చాయి. “స‌ల్మాన్… నిన్ను ఇంట్లోనే చంపుతాం. లేదా నీ కారుని బాంబు పెట్టి పేల్చేస్తాం” అని ముంబయిలోని వర్లి రవాణా శాఖ వాట్సాప్ నంబర్ కు సందేశం వ‌చ్చింది.  

దాంతో వర్లి పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అస‌లు ఈ మేసేజ్ ఎక్క‌డి నుంచి వ‌చ్చింది, సీరియ‌స్ వార్నింగా లేక కావాల‌ని ఎవ‌రైనా సందేశం పంపించారా అనే విష‌యాన్ని తేల్చేప‌నిలో వ‌ర్లి పోలీసులు ఉన్నారు. కాగా, గ‌తంలో స‌ల్లూ భాయ్‌ను చంపుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప‌లుమార్లు బెదిరించిన విష‌యం తెలిసిందే.  

Related posts

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కుదుపు …

Drukpadam

పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ…

Ram Narayana

కేంద్ర సహాయమంత్రి సురేశ్ గోపీపై కేసు నమోదు…

Ram Narayana

Leave a Comment