వక్ఫ్ చట్టంపై కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వక్ఫ్ చట్టాన్ని రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకుందని ఆరోపించారు. హర్యానాలోని హిస్సార్‌లో నూతన విమానాశ్రయం ప్రారంభోత్సవంలో మాట్లాడిన మోదీ, పవిత్రమైన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఆయుధంగా వాడుకుందన్నారు. అధికారం కోసం మతాన్ని వినియోగించి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని విమర్శించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ముస్లింలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారు? వాళ్లకు పార్టీ పదవులు, ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు ఇవ్వలేక పోయారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. నిజంగా మద్దతు ఉంటే 50 శాతం టికెట్లు ముస్లింలకు ఎందుకు రిజర్వ్ చేయ లేదన్నారు.

previous post