Aravind Kejriwal
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలు

పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ‘పుష్ప 2: ది రూల్’ సినిమాలోని ‘అంగారో కా అంబర్ సా’ పాటకు స్టెప్పు లేశారు. ఆయన కుమార్తె హర్షితా కేజ్రీవాల్వివాహం, ఐఐటీ ఢిల్లీలో సహాధ్యాయి అయిన సంభవ్ జైన్‌తో ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కేజ్రీవాల్ తన భార్య సునీతా కేజ్రీవాల్‌తో కలిసి అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమాలోని ‘అంగారో కా అంబర్ సా’ (తెలుగులో ‘పీలింగ్స్’) పాటకు డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ డ్యాన్స్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివాహానికి ముందు ఏప్రిల్ 17న శాంగ్రీ-లా హోటల్‌లో నిశ్చితార్థం, మెహందీ వంటి శుభ కార్యాలు జరిగాయి. వివాహ వేడుకలు సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో సాదాసీదాగా నిర్వహించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, మాజీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బాలీవుడ్ గాయకుడు మీకా సింగ్, ఆప్ నాయకుడు గోపాల్ రాయ్ వంటి ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. భగవంత్ మాన్ కూడా బాంగ్రా డ్యాన్స్‌తో వేడుకలకు ఊపు తెచ్చారు.

Related posts

పులివెందుల సభలో జగన్ పై చంద్రబాబు విసుర్లు ..తన సభకు వెల్లువలా జనం రావడంపై సంతోషం …

Ram Narayana

భర్త బ్యూటీపార్లర్ కు వెళ్లొద్దన్నాడని ఆత్మహత్య చేసుకున్న భార్య.. ఇండోర్ లో ఘటన

Drukpadam

జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం!

Ram Narayana