Vishakha Patnam
ఆంధ్రప్రదేశ్

కూటమికి దక్కిన విశాఖ మేయర్ పీఠం

విశాఖ మేయర్ పీఠం కూటమికి దక్కింది. జీవీఎంసీ వైసీపీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఫలితంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను వైసీపీ కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికే వైసీపీ కార్పొరేట్లర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో కూటమి బలం పెరిగింది. జీవీఎంసీలో మొత్తం 97 మంది సభ్యులు ఉన్నారు. శనివారం అవిశ్వాస తీర్మానంపై  జరిగిన సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. వీరంతా అవిశ్వానికి మద్దతుగా ఓటు వేశారు. మరో వైపు కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. పార్టీ మారిన కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు వైసీపీ విప్ జారీ చేసినా వ్యూహం ఫలించ లేదు. దీంతో, వైసీపీ మేయర్ హరివెంకట కుమారి పదవిని కోల్పోయారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జీవీఎంసీ కార్యాలయం వద్ద కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు.

Related posts

అబ్బే అదంతా వట్టిదే అన్న క్రికెటర్ నాగరాజు …ఫిర్యాదు వాపస్

Ram Narayana

జర్నలిస్టులకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలి…లోకేశ్ కు ఏపీయూడబ్ల్యూ వినతి!

Drukpadam

పశుపోషణలో కొత్త విప్లవం.. కృష్ణా జిల్లాలో పుట్టిన తొలి టెస్ట్ ట్యూబ్ దూడ!

Ram Narayana