Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

12 డిమాండ్లతో టీడీపీ సీనియ‌ర్ నేత‌ల‌తో క‌లిసి దీక్ష‌కు దిగిన చంద్ర‌బాబు…

టీడీపీ సీనియ‌ర్ నేత‌ల‌తో క‌లిసి దీక్ష‌కు దిగిన చంద్ర‌బాబు
-12 డిమాండ్లతో నేడు రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు
-అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో దీక్ష‌
-పాల్గొన్న‌ అచ్చెన్నాయుడు, రామానాయుడు, యనమల, చినరాజప్ప, సోమిరెడ్డి
-ఏపీలో క‌రో‌నా బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌
-175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌ల దీక్ష
-కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ

ఏపీలో కరోనా బాధితులను ఆదుకోవాలనే డిమాండ్‌తో అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసన దీక్షకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సాధన దీక్ష చేపడుతోన్న నేప‌థ్యంలో ఆయ‌న ఇందులో పాల్గొన్నారు. చంద్రబాబుతో పాటు దీక్షలో అచ్చెన్నాయుడు, రామానాయుడు, యనమల, సోమిరెడ్డి, చినరాజప్ప, తదితర ముఖ్యనేతలు చంద్రబాబు తోపాటు దీక్ష‌లో కూర్చున్నారు.

మొత్తం 12 డిమాండ్ల పరిష్కారాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతి తెల్ల రేషన్‌ కార్డు కుటుంబానికి తక్షణ సాయంగా 10 వేలు ఆర్థిక సాయం అందించాల‌ని టీడీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. అలాగే, కరోనా మృతుల కుటుంబాలకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది. రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాల‌ని కోరుతోంది.

కరోనా విధి నిర్వహణలో మృతి చెందిన‌ కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు 50 లక్షలు అందించాలని డిమాండ్ చేస్తోంది. జర్నలిస్టులను కరోనా వారియర్లుగా గుర్తించి వారికి బీమా సౌకర్యం కల్పించాలని కోరుతోంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తామ‌ని టీడీపీ స్ప‌ష్టం చేసింది. త‌మ‌ సలహాలు, సూచనలను సీఎం జగన్‌ పట్టించుకోవట్లేద‌ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమ‌ర్శ‌లు గుప్పించారు.

కరోనా వల్ల నష్టపోయిన వారిని ఆర్థికంగా ఆదుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం దీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం (ఎన్టీఆర్ భవన్)లో దీక్ష చేస్తుండగా , రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నేతలు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా దీక్షలో పాల్గొన్నారు .

ముఖ్యనేతలు చంద్రబాబుతో కలిసి దీక్షలో పాల్గొన్నారు . నేతలు ఎవరి నియోజకవర్గాల్లో వారు దీక్షల్లో పాల్గొన్నారు . రేషన్ కార్డుదారులకు రూ. 10 వేలు, కరోనా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలన్న డిమాండ్‌తో మొత్తం 10 డిమాండ్లతో టీడీపీ ఈ దీక్షలు చేపట్టింది.

Related posts

నిమ్మగడ్డ వైఖరి వైసిపి కి లాభం చేసిందా …?

Drukpadam

నామినేషన్ కార్యక్రమంలో భార్య వెంటే క్రికెటర్ జడేజా!

Drukpadam

గంగుల ,వద్దిరాజులపై సిబిఐ ప్రశ్నల వర్షం …9 గంటలకు పైగా విచారణ !

Drukpadam

Leave a Comment