pakisthan tested ballistic missile
జాతీయ వార్తలు

భారత్,- పాక్ ఉద్రిక్తతల నడుమ పాక్ క్షిపణి ప్రయోగం

  • 450 కి.మీ. రేంజ్ ‘అబ్దాలీ’ని పరీక్షించిన పాకిస్థాన్
  • ‘ఇండస్’ విన్యాసాల్లో పాక్ అస్త్ర ప్రదర్శన

భారత్, -పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపధ్యంలో, పాకిస్థాన్ మరో కీలక సైనిక చర్యకు ఉపక్రమించింది. భూతలం నుంచి భూతలంపైకి ప్రయోగించ గల ‘అబ్దాలీ’ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్షిపణి 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని పాక్ సైన్యం వెల్లడించింది. పాకిస్థాన్ సైన్యం చేపట్టిన ‘ఇండస్’ విన్యాసాలలో భాగంగా ఈ ‘అబ్దాలీ’ వెపన్ సిస్టమ్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించినట్లు ఆ దేశ సైనిక వర్గాలు తెలిపాయి. తమ సైనిక దళాల కార్యాచరణ సంసిద్ధతను, క్షిపణి వ్యవస్థల సామర్థ్యాన్ని నిర్ధారించుకోవడమే ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నాయి. ప్రత్యేకించి, క్షిపణిలోని అధునాతన నావిగేషన్ వ్యవస్థలతో పాటు ఇతర కీలక సాంకేతిక అంశాలను ధృవీకరించుకునేందుకే ఈ ప్రయోగం జరిపినట్లు పాకిస్థాన్ వివరించింది. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ తరచూ క్షిపణి పరీక్షల నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఏప్రిల్ 24-25, ఏప్రిల్ 26-27 తేదీల్లో కరాచీ తీరంలోని ఎకనామిక్ ఎక్స్‌క్లూజివ్‌ జోన్‌లో క్షిపణి ప్రయోగాలు నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించింది. తాజాగా ఏప్రిల్ 30 నుంచి మే 2 మధ్య మరో సారి పరీక్షలు చేపడుతున్నట్లు తెలియ జేసింది.

Related posts

ధర్మస్థలలో బయటపడుతున్న అస్థిపంజరాలు.. సిట్ దర్యాప్తులో షాకింగ్ నిజాలు!

Ram Narayana

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్…

Ram Narayana

బ్రిడ్జి కట్టేంత వరకు ఓటు వేయం.. 77 ఏళ్లుగా మూడు గ్రామాల నిరసన!

Ram Narayana