Earthquakes
తెలంగాణ వార్తలు

ఉత్తర తెలంగాణలో స్వల్ప భూకంపం

ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో మంగళవారం భూకంపంసంబావించింది. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోని వస్తువులు కదలడం, భూమి కొద్ది సెకన్ల పాటు కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక భయంతో బయటకు పరుగులు తీశారు.

ముఖ్యంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. జిల్లాలోని చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో భూమి కొన్ని క్షణాల పాటు తీవ్రంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఇళ్లు, భవనాలు కూడా కంపించాయని వారు చెప్పారు. కొందరు స్థానికులు రెండు సార్లు భూమి తీవ్రంగా కంపించిందని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయని సమాచారం. భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Related posts

ఎనిమిదేళ్లుగా సౌదీ జైల్లో మగ్గుతున్న జగిత్యాల వాసి…

Ram Narayana

కరెంటుపై గ్రామసభలు …డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

Ram Narayana

గ్రూప్-1 నియామకాలు… సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు ప్రకటించిన టీజీపీఎస్సీ!

Ram Narayana