CM Revanth Reddy
తెలంగాణ వార్తలు

ఏంచేస్తారు నన్ను కోసుకు తింటారా …? సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు తమ డిమాండ్లు పరిష్కరించమంటే ఎలా సాధ్యం …ఏంచేస్తారు…నన్ను కోసుకు తింటారా …?అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను సూటిగా ప్రశ్నించారు …రాష్ట్రానికి నెలకు వచ్చే ఆదాయం కేవలం 18 వేల 500 కోట్లు మాత్రమే ..ఇంతకు మించి రూపాయకుడా రాదు …ఆదాయం పెరగ కూడా తమ డిమాండ్లు పరిష్కరించమని ఉద్యోగ సంఘాలు అంటే ఎలా …?ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వాలి ..ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు …ఢిల్లీ పొతే దొంగలను చూసినట్లు చూస్తున్నారు …పైసా అప్పు పుట్టడంలేదు …పుడితే తెచ్చి ఇవ్వాలని నాకు కూడా ఉంది ..ఏ పథకాలు ఆపి ఉద్యోగులకు ఇవ్వాలో చెప్పండి …పెన్షన్లు ఆపాలా …?షాదీ ముబారక్ ఆపాలా ..? ఉచిత విద్యుత్ ఆపాలా ..? మీరే చెప్పండి అని కుండా బద్దలు కొట్టారు …అంటే కాదు పై పుట్టనిదానికి నన్ను కోసుకొని తింటారా ..?అంటూ భావోద్యగంగా అన్నారు …రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు …పరిస్థితి మెరుగుపడాలంటే స్వీయనియంత్రణ అవసరం …అది లేకుండా ఏమి చేయలేము అని నిష్కర్షగా చెప్పారు …ముఖ్యమంత్రి మాటలపై ప్రతిపక్షాలు స్పందించాయి…

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. స్పందించిన కేటీఆర్

KTR Responds to Revanth Reddys Remarks on Telanganas Financial Condition
  • తెలంగాణ రాష్ట్రం దివాలా తీయలేదని కేటీఆర్ స్పష్టీకరణ
  • ‘చీప్ మినిస్టర్’  అంటూ చురక
  • మేధోపరంగా, నైతికంగా కాంగ్రెస్ దివాలా తీసిందని ఆరోపణ

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తెలంగాణ దివాలా తీసిందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై రేపు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. “రాష్ట్రం దివాలా తీయలేదు. మిస్టర్ ‘చీప్ మినిస్టర్’. నిజానికి మేధోపరంగా దివాలా తీసింది, నైతికంగా దిగజారింది మీరూ, మీ అవినీతి కాంగ్రెస్ పార్టీయే” అంటూ ఘాటుగా విమర్శించారు.

Related posts

విదేశీ డిగ్రీలతో అప్పులపాలు కావొద్దు : సీజేఐ గవాయ్

Ram Narayana

నూతన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం..!

Ram Narayana

మా ఆదివాసీ దేవుళ్ల జోలికొస్తే ఊరుకునేది లేదు: మంత్రి సీతక్క హెచ్చరిక!

Ram Narayana