masood azhar
అంతర్జాతీయం

ఇక భారత్‌పై ఏమాత్రం జాలి చూపను

  • చనిపోయాడనుకున్న మసూద్ అజార్ లేఖ  విడుదల
  • భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు

‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా బవహల్పూర్‌ లోని జైష్- ఎ -మహమ్మద్‌ ప్రధాన స్థావరమైన సుభాన్ అల్లా కాంప్లెక్స్‌పై ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో జైష్ –ఎ -మహమ్మద్‌ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు హతమయ్యారు. అందులో అతడి అక్క, బావ, మేనల్లుడు, భార్య కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ పై విషం కక్కతూ.. మసూద్ అజార్ లేఖ విడుదల చేశాడు. అందులో తాను కూడా చని పోయి ఉంటే బాగుండేదని ప్రస్తావించాడు. ప్రధాని మోడీ కశ్మీర్ విషయంలో అన్ని నియమాలను ఉల్లంఘించారని ఆక్రోశించారు. భారత్‌పై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేశాడు. ఇక భారత్‌పై ఏ మాత్రం జాలి చూపబోమని బీరాలు పలికాడు. భయం లేదు .. నిరాశ లేదు .. దుఖం లేదంటూ చని పోయాడని అనుకున్న మసూద్ అజార్ రాసిన లేఖ ప్రస్తుతం వైరల్గా మారింది.

Related posts

భారత్ ఓ ఆర్థికశక్తి.. కెనడా ప్రధాని వ్యాఖ్య

Ram Narayana

ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు!

Ram Narayana

‘అమితాబ్ బచ్చన్’ కోసం వెతుకుతున్న డెన్మార్క్ మహిళ … కారణం తెలిస్తే నవ్వాపుకోలేరు !

Ram Narayana