YS Jagan
ఆంధ్రప్రదేశ్

ఏపీలో కూటమి పాలనపై జూన్‌ 4న వెన్నుపోటు దినం …  వైఎస్‌ జగన్‌

ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలపై వైసీపీ( YCP ) జూన్‌ 4న వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌( YS Jagan) వెల్లడించారు. గురువారం తాడేపల్లి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చంద్రబాబు ( Chandra Babu ) ప్రభుత్వ ఏడాది పాలనపై విరుచుకుపడ్డారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కూటమి సర్కార్‌ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ జూన్‌ 4న వెన్నుపోటు దినాన్ని నిర్వహించి కలెక్టర్లను కలిసి హామీల డిమాండ్‌ పత్రాలను సమర్పిస్తామని తెలిపారు. వైసీపీ హాయంలో లాభాపేక్షల లేకుండా మధ్యం అమ్మకాలు జరిపామని వెల్లడించారు. మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. లిక్కర్‌ స్కాం జరుగలేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు అన్నారని, ఆయన పాలనలోనే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో గల్లీగల్లీకి బెల్ట్‌షాపులు వెలిశాయని దుయ్య బట్టారు. బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేయకుండా మద్యాన్ని డెలివరీ చేస్తున్నారని విమర్శించారు. మునుపెన్నడూ లేని విధంగా కొత్తకొత్త బ్రాండులను తీసుకొచ్చారని పేర్కొన్నారు. గతంలో లిక్కర్‌ స్కాంలో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ఇవాళ్లికి బెయిల్‌ మీద ఉంది నిజం కాదా అంటు నిలదీశారు. తమ అనుచరులను బెదిరించి తప్పుడు సాక్ష్యాలను సృష్టించి తప్పుడు వాంగ్మూలాలతో చంద్రబాబు లిక్కర్‌ స్కాం అంటూ భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని జగన్‌ ఆరోపించారు. విజయసాయిరెడ్డి ( Vijayasai reddy) చంద్రబాబుకు లొంగిపోయారని విమర్శించారు.

Related posts

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారికి ఏపీ సీఐడీ చీఫ్ హెచ్చరిక

Ram Narayana

సిరివెన్నెల మృతి ప‌ట్ల సీఎం జ‌గ‌న్, చంద్రబాబు,కేసీఆర్ దిగ్భ్రాంతి!

Drukpadam

కోన‌సీమ ఇక‌పై అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా… ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్!

Drukpadam