KCR -Kavitha
తెలంగాణ వార్తలు

డియర్ డాడీ … ఎందుకిలా చేస్తున్నారు ? …. కేసీఆర్ కు కవిత సంచలన లేఖ

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, సభలో కేసీఆర్ ప్రసంగంపై సానుకూల, ప్రతికూల స్పందనలను వివరిస్తూ కవిత ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. గతంలో కవిత రాసిన లేఖల్లోని దస్తూరితో ఈ లేఖలోని చేతిరాత సరిపోలుతుండటం గమనార్హం. ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ సభ విజయవంతమైనందుకు తండ్రి కేసీఆర్‌కు అభినందనలు తెలియజేస్తూ, కవిత పలు కీలక అంశాలను ఈ లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా, సభలో బీజేపీపై కేసీఆర్ పరిమితంగా విమర్శలు చేయడం వల్ల, భవిష్యత్తులో ఆ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందన్న ఊహాగానాలు ప్రజల్లోకి వెళ్లాయని ఆమె పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించాలని లేదా మార్గనిర్దేశం చేయాలని అందరూ ఆశించినట్లు తెలిపారు. నెగిటివ్ ఫీడ్ బ్యాక్ పేరిట కొన్ని అంశాలను ఆమె ప్రస్తావించారని సమాచారం.

Related posts

ఫార్ములా – ఈ రేసు కేసు : కేటీఆర్‌కు మళ్ళీ ఏసీబీ నోటీసులు

Ram Narayana

కేసీఆర్ కు నోటీసులు అందించిన సిట్.. రేపే విచారణ…బీఆర్ యస్ ఆగ్రహం…

Ram Narayana

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు… సర్వం సిద్ధం…

Ram Narayana