జాతీయ రాజకీయ వార్తలు

శిథరూర్ కాంగ్రెస్ వీడుతున్నట్లేనా ….?

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కాంగ్రెస్ వీడేందుకు సిద్దపడ్డారా…? అంటే అవుననే సమాధానమే వస్తుంది …మొదటి నుంచి అసమ్మతి గళాన్ని వినిపిస్తూ వస్తున్నా శశిథరూర్ ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో సైతం ఖర్గే పోటీ చేసి ఓడిపోయారు ..తరువాత ఆయన కాంగ్రెస్ లోనే ఉన్న తనను పార్టీ విస్మరిస్తోందని అభిప్రాయంతో ఉన్నారు …ఇటీవల ప్రధాని మోడీ కేరళ పర్యటన సందర్భంగా ఆయన తో కలిసి వేదికను పంచుకున్న ప్రధాని ఈ దృశ్యం చూసి కొందరికి ప్రకంపనలు పుడతాయని వ్యాఖ్యానించారు …అప్పటి నుంచి శశిథరూర్ వైఖరిలో మార్పు వచ్చింది …దాని కొనసాగింపుగానే ఆయన బీజేపీకి దగ్గరవుతున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు …

శశిథరూర్ కాంగ్రెస్ మధ్య రోజురోజుకు గ్యాప్ పెరుగుతుంది …పహాల్గమ్ ఉదంతం అనంతరం పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడి జరిగిన తర్వాత భారత్ వైఖరిని ప్రపంచ దేశాలకు వినిపించేందుకు ఎంపీల బృందాలను వివిధ దేశాలకు పంపింది …అందులో ఒక బృందానికి కాంగ్రెస్ అసమ్మతి నేత శశిథరూర్ నేతృత్వం వహింస్తున్న సంగతి విదితమే …అయితే ఆయన తాను కాంగ్రెస్ అన్న విషయం మరిచిపోయి బీజేపీ ప్రతినిధిలా వ్యవరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు …దీనిపై ఇప్పటికే ఆయన విమర్శల దాడి మొదలు పెట్టారు …

గతంలో సర్జికల్ స్ట్రైక్స్‌పై శశిథరూర్ వ్యాఖ్యలు: కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా చురక

Shashi Tharoors Remarks on Surgical Strikes Draw Criticism
  • మోదీ సర్కార్ అనుకూల వ్యాఖ్యలతో వార్తల్లో శశి థరూర్
  • శశి థరూర్ తీరుపై కాంగ్రెస్‌లో అసంతృప్తి
  • గతంలో బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించిన థరూర్ పుస్తక భాగం షేర్ చేసిన పవన్ ఖేడా
  • సర్జికల్ స్ట్రైక్స్‌ను రాజకీయాలకు వాడుకున్నారన్న థరూర్ పాత వ్యాఖ్యలు
  • థరూర్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానంటూ పవన్ ఖేడా చురక

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఇటీవల మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు పవన్ ఖేడా గతంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ శశి థరూర్ రాసిన పుస్తకంలోని కొన్ని కీలక వాక్యాలను గుర్తుచేశారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌పై థరూర్ తన పుస్తకంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు పవన్ ఖేడా ‘ఎక్స్’ వేదికగా చురక అంటించారు.

పవన్ ఖేడా షేర్ చేసిన ఫొటోలో శశి థరూర్ గతంలో రాసిన పుస్తకంలోని పేరా ఉంది. అందులో “2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్‌ను పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. అంతకుముందు మయన్మార్‌లో తిరుగుబాటుదారులపై జరిగిన సైనిక చర్యను కూడా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఇలాంటివి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదు” అని శశి థరూర్ విమర్శించినట్లు ఉంది.

ఈ పేరా ఫొటోను షేర్ చేస్తూ “ప్రస్తుతం నేను ఈ పుస్తకం చదువుతున్నాను. శశి థరూర్ గారూ మీరు చేసిన ఈ వ్యాఖ్యలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను” అని పవన్ ఖేడా తన పోస్టులో రాసుకొచ్చారు.

ఇటీవల పనామాలో జరిగిన ఓ విలేకరుల సమావేశంలో శశి థరూర్ మాట్లాడుతూ 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌తోనే భారత్ తొలిసారిగా పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించిందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు థరూర్‌పై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే తాను కేవలం ప్రస్తుత ఉగ్రదాడుల గురించి మాత్రమే మాట్లాడానని గతంలో జరిగిన యుద్ధాల గురించి ప్రస్తావించలేదని శశి థరూర్ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ ఖేడా తాజాగా చేసిన పోస్ట్ ద్వారా గతంలో థరూర్ చేసిన విమర్శలను తెరపైకి తెచ్చారు.

శశి థరూర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే విషయం సీడబ్ల్యూసీ చూసుకుంటుంది: ఉదిత్ రాజ్

Shashi Tharoor Suspension Matter for CWC Says Udith Raj
  • పనామాలో శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం
  • కాంగ్రెస్ పార్టీ చరిత్రను థరూర్ కించపరుస్తున్నారని ఉదిత్ రాజ్ ఆరోపణ
  • మోదీ సర్జికల్ దాడులను థరూర్ సమర్థించారని, పహల్గామ్ ఘటనను తక్కువచేశారని విమర్శ
  • “ఆపరేషన్ సిందూర్” ఫేక్ అంటూ ఉదిత్ రాజ్ వ్యాఖ్య
  • సైన్యం ఘనత సైన్యానికే దక్కాలి, మోదీకాదని ఉదిత్ రాజ్ స్పష్టం
  • థరూర్ వ్యాఖ్యలను సమర్థించిన బీజేపీ నేతలు కిరణ్ రిజిజు, షెహజాద్ పూనావాలా

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారానికి దారితీశాయి. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని చెబుతూ, పార్టీ చరిత్రను థరూర్ మసకబారుస్తున్నారని మరో కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ గురువారం తీవ్రస్థాయిలో విమర్శించారు. పనామాలో జరిగిన ఓ కార్యక్రమంలో, భారత్ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక దాడులను థరూర్ ప్రశంసించడమే ఈ వివాదానికి ఆజ్యం పోసింది.

థరూర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అన్న ప్రశ్నకు ఉదిత్ రాజ్ స్పందిస్తూ, “అది వర్కింగ్ కమిటీ, జాతీయ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆయన తప్పుడు ప్రకటనలు చేసి, కాంగ్రెస్ చరిత్రను చెరిపేయాలని ప్రయత్నిస్తే, నేను కాంగ్రెస్‌తోనే నిలబడతాను. వ్యక్తిగత ప్రయోజనాల గురించి నేను ఆందోళన చెందను.. నన్ను నేను త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ ఏమీ చేయలేదని చెబుతూ కాంగ్రెస్‌ను అపఖ్యాతి పాలు చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు” అని అన్నారు.

పహల్గామ్ ఘటనలో 26 మంది మరణించడానికి కారణమైన భద్రతా వైఫల్యాలను థరూర్ సమర్థించారని ఉదిత్ రాజ్ ఆరోపించారు. “ఆపరేషన్ సిందూర్” ఒక బూటకమని ఆయన కొట్టిపారేశారు. “నా వైఖరికి, పార్టీ వైఖరికి మధ్య ఎందుకు తేడా చూపిస్తున్నారు? నేను నిన్న చెప్పినదాన్ని జైరాం రమేష్, పవన్ ఖేరా కూడా రీపోస్ట్ చేశారు కదా” అని ఉదిత్ రాజ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ప్రశ్నించారు.

ప్రధాని మోదీ చేసిన నకిలీ సర్జికల్ దాడులను థరూర్ కీర్తిస్తున్నారని, భద్రతా లోపాలు ఎక్కడైనా జరుగుతాయని చెప్పడం నేరమని ఉదిత్ రాజ్ మండిపడ్డారు. “మీరు కార్యాలయాన్ని, భద్రతా లోపాలను సమర్థిస్తున్నారు. ఇది దేశ ప్రయోజనాలకు అనుకూలమా? స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత కూడా వారు ఎప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా లేరు. మోదీజీ సైనిక యూనిఫాం వేసుకుని తిరుగుతున్నారు. మోదీజీ యుద్ధానికి వెళ్లినట్టా? సైన్యం ఘనత, సైన్యం పరాక్రమం సైన్యానికే దక్కాలి” అని ఉదిత్ రాజ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

నాకు అంతకంటే ముఖ్యమైన పనులు ఉన్నాయి: కాంగ్రెస్ నేతలపై శశిథరూర్ ఆగ్రహం

Shashi Tharoor Responds to Congress Leaders Criticism
  • ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వ చర్యలను కొనియాడిన శశిథరూర్
  • పనామాలో ప్రసంగిస్తూ సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడుల ప్రస్తావన
  • థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతల తీవ్ర అభ్యంతరం
  • తనపై విమర్శలను తోసిపుచ్చిన థరూర్.. వారికి వేరే పనులు లేవంటూ చురక

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ మరోసారి సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఉగ్రవాదంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించడమే ఇందుకు కారణం. తనపై వస్తున్న విమర్శలను, ట్రోల్స్‌ను పట్టించుకోనని, తనకు అంతకంటే ముఖ్యమైన పనులున్నాయని ఆయన బదులిచ్చారు.

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రపంచస్థాయి ప్రచారంలో భాగంగా శశిథరూర్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా, పనామా పర్యటనల అనంతరం ఈ బృందం ప్రస్తుతం బొగోటాకు బయలుదేరింది.

బుధవారం పనామా నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో శశిథరూర్ మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో భారత్‌ను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులకు తాము తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే విషయం అర్థమైందని అన్నారు. “యూరీ దాడుల అనంతరం తొలిసారిగా నియంత్రణ రేఖ దాటి సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. పుల్వామా దాడి తర్వాత నియంత్రణ రేఖనే కాకుండా అంతర్జాతీయ సరిహద్దును కూడా దాటి బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాం. ఈసారి అంతకు మించి పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాం” అని థరూర్ వివరించారు.

థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఉదిత్ రాజ్ మాట్లాడుతూ, థరూర్ బీజేపీకి సూపర్ ప్రతినిధిగా మారి, మోదీ భజన చేస్తున్నారని ఆరోపించారు. పవన్ ఖేరా, జైరాం రమేశ్ కూడా థరూర్‌ను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. యూపీఏ హయాంలోనూ అనేక సర్జికల్ దాడులు జరిగాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన వీడియోను ఖేరా ట్యాగ్ చేశారు.

ఈ విమర్శలపై శశిథరూర్ గురువారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. “పనామాలో కార్యక్రమాలు ముగించుకుని, ఆరు గంటల్లో కొలంబియాలోని బొగోటాకు బయల్దేరాల్సి ఉంది. అయినా కొందరు నాపై నిందలు వేస్తున్నారు. నేను ఉగ్రవాద దాడులపై ప్రతీకార చర్యల గురించే స్పష్టంగా మాట్లాడాను తప్ప, గత యుద్ధాల గురించి కాదు. నా వ్యాఖ్యలను వక్రీకరించేవారికి, ట్రోల్ చేసేవారికి ఇదే నా సమాధానం. నాకు ఇంతకంటే ముఖ్యమైన పనులున్నాయి” అని పేర్కొన్నారు.

Related posts

మా కూటమి గెలుస్తుంది.. నేనే ముఖ్యమంత్రిని అని బీజేపీ చెప్పింది: పళనిస్వామి

Ram Narayana

ఏక్‌నాథ్ షిండే మాతోనే ఉంటారు.. ఉండాలని అందరూ కోరుకుంటున్నారు: ఫడ్నవీస్

Ram Narayana

లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ… సీడబ్ల్యూసీ తీర్మానం…

Ram Narayana