తెలంగాణ వార్తలు

దేశ చరిత్రలో అరుదైన చట్టం భూభారతి …మూలుగుమాడులో డిప్యూటీ సీఎం భట్టి

.
దేశ చరిత్రలో అరుదైన చట్టం భూభారతి.. రైతుల భూములు సర్వే చేయించి సంపూర్ణంగా సరిహద్దులు గుర్తించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడమే ఈ చట్టం లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం మధిర నియోజకవర్గం ములుగుమాడులో భూభారతి చట్టం కింద పైలెట్ సర్వే ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రైతాంగం ఎదురుకుంటున్న సమస్యలకి భూభారతి చట్టం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తాం అన్నారు. ఇప్పటివరకు రైతులు తమ భూ సమస్యల కోసం రెవెన్యూ కార్యాలయాలు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు ఇకపై ఆ పరిస్థితి ఉండదు అని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు ధరణి సమస్యల నుంచి విముక్తి కల్పించాలని లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చింది అన్నారు. రెవిన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి భూ సమస్యల పరిష్కారం కోసం వివిధ రాష్ట్రాల్లో పర్యటించి చారిత్రాత్మక చట్టాన్ని మన ముందుకు తీసుకువచ్చారని తెలిపారు. భూభారతి చట్టాన్ని రూపొందించిన రెవిన్యూ మంత్రి ఖమ్మం జిల్లా వాసి కావడం గర్వకారణం అన్నారు.
స్వాతంత్రం వచ్చిన తర్వాత తెచ్చిన 3 భూ చట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే వచ్చాయని అన్నారు. వాటి ద్వారా రాష్ట్ర రైతులకు, ప్రజలకు వారి భూమిపై భరోసా ఉండేది అన్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి చట్టం రైతుల హక్కులను కాల రాసింది. అసలు రైతును ఆగం..ఆగం చేసింది. భూమికి సంబంధించిన సమస్యలన్నీ ధరణితోనే వచ్చాయి అన్నారు. టిఆర్ఎస్ నాయకులు వాళ్లకు కావాల్సిన వ్యక్తులకు భూములు కట్టబెట్టి తిరిగి సవరణ చేసే అవకాశం లేకుండా ధరణి చట్టాన్ని తీసుకువచ్చారు.. పది ఎకరాల భూమి ఉంటే 17 ఎకరాలకు పాస్ బుక్కులు ఇచ్చారు, భూములు లేకుండానే వందల ఎకరాలకు పాస్బుక్కులు ఇచ్చిన చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వానిది అని తెలిపారు.

ఎన్నికల ముందు పిసిసి అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి భారీ సభలు నిర్వహిస్తూ మరోవైపు సిఎల్పీ నేతగా తాను పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా చెప్పినట్టుగా ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో వేసాం, ప్రజలకు అనువైన చట్టాన్ని తీసుకువచ్చా అన్నారు. భూ సంస్కరణ ల చట్టంలో భాగంగా రాష్ట్రంలో 26 లక్షల ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచింది. దానిని బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి చట్టంలోని పార్ట్ బి లో పెట్టింది.. ఎటువంటి విచారణ చేయలేదు అని డిప్యూటీ సీఎం తెలిపారు. తిరిగి ఆ అసైన్డ్ భూములన్నిటిని విచారించి అర్హులైన హక్కుదారులందరికీ భూ పట్టాలు ఇచ్చి వారి భూమిలో కూర్చోబెడతాం అని తెలిపారు. భూమిలేని పేదలకు సాగుభూమి, ఇళ్ల స్థలాలు ఇచ్చే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోని అసైన్డ్ కమిటీలను భూభారతి చట్టంతో తిరిగి ప్రారంభిస్తున్నాం. గత పది సంవత్సరాలు పాటు అసైన్మెంట్ కమిటీలు జరగకపోవడంతో అనేక రకాల భూ సమస్యలు ఉత్పన్నం అయ్యాయి అన్నారు. ఆబాది భూమిని సర్వే చేసే అవకాశం కొత్త చట్టం కల్పిస్తుంది. ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించి. గ్రామసభలో ఎవరు భూములు అమ్మారు.. భూ రికార్డుల్లో జరిగిన మార్పులను గ్రామ సభ ద్వారా వివరించే అవకాశాన్ని భూభారతి చట్టం కల్పిస్తుందనీ తెలిపారు. భూభారతి చట్టం ప్రజలు సాధించిన విజయం, రైతులు భూమికి ఉన్న న్యాయబద్ధమైన హక్కులను కొలిచి అప్పగిస్తాం. పైలట్ ప్రాజెక్టు కింద సర్వే చేపడుతున్నాము అంటే ములుగుమాడు ఊరంతా కదిలి వచ్చింది. దీనిని బట్టి అర్థమవుతుంది ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప కీర్తి రాబోతుందని స్పష్టం చేశారు.భూభారతి చట్టం మన అందరిదీ అవగాహన చేసుకోవాలి పది మందికి వివరించాలి అన్నారు.

జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని భూభారతి విశిష్టత గురించి ,రైతులకు ఏరకంగా అది ప్రయోజనమూ వివరించారు …

Related posts

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ… ఎందుకంటే?

Ram Narayana

ప్రియుడిని పెళ్లి చేసుకున్న కూతురు.. తన ఆవేదనను ఫ్లెక్సీ ద్వారా తెలిపిన తండ్రి..

Ram Narayana

బీజేపీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా ఖమ్మంలో గెలవలేరు…కూనంనేని

Drukpadam