కమల్‌హాసన్‌పై కర్నాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మీరేమైనా చరిత్రకారులా అని ప్రశ్నించిన హైకోర్టు
తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందన్న వ్యాఖ్యలను..
ఏ ఆధారాలతో చేశారని ప్రశ్నించిన కర్నాటక హైకోర్ట్
క్షమాపణ చెబితే సమస్య పరిష్కారమవుతుందన్న కోర్టు
ప్రముఖ సినీ నటులు దక్షణాది లెజెండ్ గా పేరుపొందిన కమల్ హాసన్ కన్నడ భాషను కించపరిచే విధంగా మాట్లాడారని కర్ణాటక హైకోర్టు తప్పు పట్టింది …తమిళ భాష నుంచే కన్నడం పుట్టిందని ఏ ఆధారాలతో చెప్పారని ప్రశ్నించింది …మీరేమైనా చరిత్రకారుల అంటూ నిలదీసింది …కమల్ హాసన్ స్వయంగా క్షిపణలు చెపితే సమస్య పరిస్కారం అవుతుందని కోర్ట్ స్పష్టం చేసింది …ఇప్పటికే తమిళనాడు నుంచి అధికార డీఎంకే పార్టీ మద్దతుతో రాజ్యసభకు ఆయన పేరు ప్రకటించిన నేపథ్యంలో కమల్ హాసన్ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం చర్చినీయాంశంగా మారింది …కోర్ట్ వ్యాఖ్యలపై కమల్ హాసన్ కానీ ఆయన తరుపున న్యావాదులు కానీ స్పందించలేదు …
Save or share this story as a newspaper-style Epaper Clip: