ఖమ్మం వార్తలు

జోరుగా బీఆర్ఎస్ సిపిఎం మున్సిపల్ ఎన్నికల ప్రచారం

బీఆర్ఎస్, సీపీఎం పొత్తులో పోటీ చేసే అభ్యర్థులను ఆశీర్వదించండి – మాజీ ఎంపీ నామ

అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది – మాజీ ఎంపీ నామ

పదేళ్ల కేసీఆర్ పాలనలోనే పట్టణాలు, పల్లెలు అభివృద్ధి జరిగాయి – మాజీ ఎంపీ నామ

రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధి శూన్యం – మాజీ ఎంపీ నామ

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలోని వైరా పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, వైరా మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో గురువారం నాడు బీఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ, బీఆర్ఎస్,సీపీఎం పార్టీల పొత్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శించారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచేందుకు ‘బాకీ కార్డు’తో ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను బాకీ కార్డుతో నిలదీయాలని ప్రజలకు సూచించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పట్టణాల్లో అభివృద్ధి శూన్యమని, కేసీఆర్ పాలనలోనే పట్టణాలు, పల్లెలు సమగ్రంగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే బీఆర్ఎస్ పార్టీ విజయానికి కారణమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో వైరా పట్టణం గణనీయంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో విద్యుత్ కోతలతో దుకాణాల ముందు జనరేటర్లు ఉండేవని, కేసీఆర్ పాలనలో కరెంట్ కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్య, వైద్యం, తాగునీరు, సాగునీటి రంగాల్లో విస్తృత అభివృద్ధి జరిగిందని నామ తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ శాసనసభ్యులు బానోత్ చంద్రావతి, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఎం పార్టీ డివిజన్ సెక్రటరీ వీరభద్రం, నియోజకవర్గ నాయకురాలు బానోత్ మంజుల, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు, వైరా రూరల్, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, మద్దెల రవి, మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జునరావు, వనమా వీశ్వేశ్వరరావు గారు, బీఆర్ఎస్ ఖమ్మం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు, రఘునాథపాలెం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరునాయక్, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, ముత్యాల వెంకట అప్పారావు, వైరా జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యులు షేక్ లాల్ మొహమ్మద్ పట్టణ మహిళా అధ్యక్షురాలు బానోత్ సక్కుబాయి, మాజీ కౌన్సిలర్లు, వైరా పట్టణ, రూరల్ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఖమ్మం కార్పొరేషన్ లో బీఆర్ యస్ వర్సెస్ కాంగ్రెస్ ఢీ…!

Ram Narayana

నేనేం చేయాలో చెప్పు సోమన్న.. మంత్రి పొంగులేటి

Ram Narayana

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు …మంత్రి తుమ్మల

Ram Narayana