పార్లమంట్ న్యూస్ ...

మోదీకి రాహుల్ గాంధీ ఆలింగనం… పార్లమెంటులో కిరణ్ రిజిజు వర్సెస్ ప్రియాంక గాంధీ

  • గతంలో పార్లమెంటులో మోదీని రాహుల్ ఆలింగనం చేసుకున్నారన్న కిరణ్ రిజిజు
  • ఆ తర్వాత తోటి కాంగ్రెస్ ఎంపీలను చూసుకుని కళ్లెగరేశారని వ్యాఖ్య
  • ఇలాంటి నేతను ఎన్నడూ చూడలేదన్న కిరణ్ రిజిజు
  • 12 ఏళ్లుగా కేంద్రానికి దీటుగా నిలుస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీయే అన్న ప్రియాంక

పార్లమెంటులో గతంలో ప్రధాని నరేంద్ర మోదీని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకున్న ఘటనపై లోక్ సభలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఈరోజు సభలో చర్చ కొనసాగింది.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, గతంలో రాహుల్ గాంధీ మోదీ వద్దకు వచ్చి ఆలింగనం చేసుకుని వెళ్లి తన సీట్లో కూర్చున్నాడని వెల్లడించారు. ఆ తర్వాత తోటి కాంగ్రెస్ ఎంపీలను చూసుకుని కళ్లెగరేశారని, అలాంటి నేతను ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు.

మోదీని రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకోవడంపై కిరణ్ రిజిజు విమర్శలు చేయగా, కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. గత పన్నెండేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి దీటుగా నిలిచిన వ్యక్తి రాహుల్ గాంధీయే అన్నారు. అలాంటి నాయకుడిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

Related posts

పార్లమెంట్ ఆవరణలో ఎంపీల డిష్యుం ..డిష్యుం

Ram Narayana

తమ సభ్యులు పార్టీ మారడానికి ప్రలోభాలే కారణం…విజయసాయి

Ram Narayana

చరిత్రాత్మక ఘటన.. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన ప్రక్రియకు లోక్ సభలో శ్రీకారం

Ram Narayana