జాతీయ వార్తలు

ఐజేయూ అధ్యక్షుడుగా బల్వీందర్ సింగ్, సెక్రటరీ జనరల్ గా సోమసుందర్ బాధ్యతల స్వీకరణ

విజయవాడలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ ముగింపు సందర్భంగా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. ఐ.జే.యు. అధ్యక్షునిగా బల్విందర్ సింగ్ జమూ (పంజాబ్) , సెక్రటరీ జనరల్‌గా డి.సోమసుందర్ (ఆంధ్రప్రదేశ్) గతంలోనే ఏకగ్రీవంగా ఎన్నిక కాగా వారు ప్లీనరీ వేదికపై ఆదివారం తమ బాధ్యతలు చేపట్టారు.

మిగిలిన ఆఫీస్ బేరర్ పోస్టులకు, కార్యవర్గ స్థానాలకు ఎన్నికల ప్రక్రియను ఎన్నికల అధికారిగా ఐజేయూ జాతీయ కార్యవర్గం సీనియర్ పాత్రికేయుడు ఎం.ఎ. మాజిద్ నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యాక ఫలితాలను ఎన్నికల అధికారి ఎం.ఎ. మాజిద్  ప్లీనరీలో ప్రకటించారు.

జాతీయ ఉపాధ్యక్షులుగా అమర్ మోహన్ ప్రసాద్ (బీహర్), వై.నరేందర్ రెడ్డి (తెలంగాణా ),  జాతీయ కార్యదర్శులుగా నరేంద్ర భరద్వాజ్ (ఉత్తర ప్రదేశ్ ), డి.ఎస్.ఆర్.సుభాష్ (తమిళనాడు),  పి. భాస్కర్ రెడ్డి (కర్ణాటక), కోశాధికారిగా బల్బీర్ సింగ్ జండు (పంజాబ్) ఎన్నికయ్యారు.

జాతీయ కార్యవర్గ సభ్యులుగా రవీందర్ సింగ్ (ఉత్తర ప్రదేశ్) , కే.సత్యనారాయణ (తెలంగాణా), కే. అజిత (తెలంగాణా), నగునూరి శేఖర్ (తెలంగాణా) కూన అజయ్ బాబు (ఆంధ్ర ప్రదేశ్) ఈ.ఎన్.రాజు (ఆంధ్రప్రదేశ్),  కుణాల్ జే. మాత్రే (మహారాష్ట్ర), మోహన్ రాజ్ శ్రీనివాసన్ (తమిళనాడు),  బిందూ సింగ్ (పంజాబ్ అండ్ చండీఘర్), ఎం.పీ. మహారాజ (పాండిచ్చేరి), సి.ఎం.సాబిర్ అలీ (కేరళమ్), జయశ్రీ భట్టాచార్య (పశ్చిమ బెంగాల్), వినీతా మండల్ హల్దర్ (ఛత్తీస్ ఘడ్), శివేంద్ర నారాయణ్ సింగ్ (బీహార్), టి. శ్రీనివాసరావు (న్యూఢిల్లీ), ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గం రెండేళ్లపాటు బాధ్యతల్లో ఉంటుంది.

Related posts

ఎన్డీయేలో ఉన్నాం… విపక్షాల అభ్యర్థికి ఎలా మద్దతిస్తాం?: చంద్రబాబు

Ram Narayana

మీరు బెంగాల్‌ను ప్రేమిస్తే, బెంగాల్ మిమ్మల్ని ప్రేమిస్తుంది… కొత్త గవర్నర్‌కు మమతా కీలక సందేశం

Ram Narayana

ప్రజ్వల్ ను దేశం దాటించారు.. మమ్మల్ని అరెస్ట్ చేయడం దారుణం: కవిత

Ram Narayana