ఆంధ్రప్రదేశ్

ప్రేమ జంటల పాలిట కీచకుడు… పల్నాడు జిల్లాలో ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు…

ASI Srinivas suspended for harassing couples in Palnadu district

పల్నాడు జిల్లా మాచర్లలో ఓ ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రేమ జంటలను బెదిరించి డబ్బు వసూలు చేయడంతో పాటు, మహిళలను వేధించారన్న ఆరోపణలు నిరూపితం కావడంతో ఏఎస్సై శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ పోలీసు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాల్లోకి వెళితే, మాచర్ల నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రేమికులు, కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా శ్రీనివాస్ వ్యవహరించినట్లు తేలింది. వారి ఏకాంతాన్ని వీడియోలు తీయించి, బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా, యువతులను బెదిరించి తన కోరికలు తీర్చాలంటూ ఒత్తిడి చేసి వేధింపులకు పాల్పడేవాడని కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

ఆయన అకృత్యాలకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసు శాఖ వెంటనే స్పందించి విచారణ చేపట్టింది. విచారణలో ఆరోపణలన్నీ నిజమని తేలడంతో ఏఎస్సై శ్రీనివాస్‌పై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. 

పల్నాడులో ఏఎస్సై బాగోతం.. జంటలను వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్!

పల్నాడు జిల్లాలో ఓ ఏఎస్సై నిర్వాకం తీవ్ర కలకలం రేపుతోంది. ఏకాంతంగా గడుపుతున్న జంటలను లక్ష్యంగా చేసుకుని, వారిని వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందాకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రేమికులు, కళాశాల విద్యార్థులే లక్ష్యంగా ఈ ఏఎస్సై దందాలకు పాల్పడుతున్నాడు. జమ్మలమడుగుకు చెందిన ఓ ఆటోడ్రైవర్ సాయంతో జంటలు సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు తీయించి, వారిని స్టేషన్‌కు తీసుకెళ్తానంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వలేని యువతులను తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధిస్తున్నట్లు కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవల మాచర్లలోని ఓ వ్యాపారి, మహిళతో ఏకాంతంగా ఉన్న వీడియో తీసి, వారిని బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఇదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మరో ఎస్సై, కానిస్టేబుల్‌కు కూడా ఈ దందాలో భాగం ఉందని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు స్పందించారు. సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Related posts

కొవ్వూరు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం…. ముగ్గురు యువకులు మృతి

Ram Narayana

ఆనాడు ఎమ్మెల్యేలను రామకృష్ణ స్టూడియోకు తరలించి క్యాంపు నిర్వహించాల్సి వచ్చింది: సీఎం చంద్రబాబు

Ram Narayana

పదకొండేళ్ల చిన్నారికి ప్రేమ లేఖలు రాసిన టీచర్.. అమెరికాలో ఘటన

Ram Narayana