తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్…? ..ఆసక్తి రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్ పార్టీ పేరును తిరిగి టీఆర్‌ఎస్‌ (తెలంగాణ రాష్ట్ర సమితి)గా మార్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కొన్ని పొరపాట్లు చేసిందని కేటీఆర్ అంగీకరించారు. ఈ తప్పుల కారణంగా ప్రజలకు, పార్టీ నాయకులకు మధ్య కొంత దూరం పెరిగిందని, దీనిపై తాము పూర్తిస్థాయిలో అధ్యయనం చేశామని తెలిపారు. గుర్తించిన లోపాలను సరిదిద్దుకుని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలను, సర్పంచులను, ఎంపీటీసీ, మండల అధ్యక్షులను కలుపుకొని పోవడంలో విఫలమయ్యాం మా పాలనలో అందరు జర్నలిస్టులకు న్యాయం చేయలేకపోయాం. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా లక్షలాది మంది గల్ఫ్‌లో ఉంటున్నా మేం గల్ఫ్ పాలసీ తీసుకురాలేకపోయాం. టీజీబీకేఎస్‌లో జరిగిన ఘటనలను బీఆర్ఎస్ అప్పుడే కొంత సీరియస్‌గా తీసుకుని ఉంటే మరిన్ని అసెంబ్లీ సీట్లు గెలిచేవాళ్ళం.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మా పార్టీ బలం పెరుగుతుంది.మే, జూన్ నెలలో పార్టీ సభ్యత్వం స్టార్ట్ చేస్తాం, కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి పార్టీ పటిష్టతకు కృషి చేస్తాం.

“చంద్రుడిపై కొన్ని మబ్బులు కమ్మినంత మాత్రాన చంద్రుడు కనుమరుగు కాడు. ఆ మబ్బులు తొలగి మళ్లీ ప్రకాశిస్తాడు. బీఆర్‌ఎస్ కూడా తాత్కాలికంగా వెనుకబడ్డా తిరిగి పుంజుకుని అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు” అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కి, పార్లమెంట్ స్థానాలు 28కి పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

రాజకీయాల్లో డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని, మేధావులు మౌనంగా ఉంటున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ గొప్ప ముఖ్యమంత్రులుగా నిలిచారని ప్రస్తావించారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ పేరు మార్పు ఆలోచన, భవిష్యత్ వ్యూహాలపై విశ్లేషణలు మొదలయ్యాయి.

Related posts

త్వరలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం: ఆదిలాబాద్ సభలో రేవంత్ రెడ్డి

Ram Narayana

బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి… ఆగ్రహం వ్యక్తం చేసిన టీపీసీసీ!

Ram Narayana

మంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడను ,ఇవ్వాల్సిందే …రాజగోపాల్ రెడ్డి

Ram Narayana