Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేపే ఖమ్మంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌…అభ్యర్థుల్లో టెన్షన్!

రేపే ఖమ్మంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌…అభ్యర్థుల్లో టెన్షన్!
-గెలుపుపై ధీమాలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు
-ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న కాంగ్రెస్ అభ్యర్థి రాయల
తోసి పుచ్చిన ఎన్నికల సంఘం
-ఎన్నికల్లో గెలుపుపై బెట్టింగుల జోరు
-విజయోత్సవ ర్యాలీలు చేయవద్దు :సీపీ విష్ణు యస్ వారియర్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ పూర్తికావ డంతో ప్రస్తుతం అధికారయంత్రాంగం, రాజకీయపార్టీలు కౌంటింగ్‌పై దృష్టిసారించాయి. మంగళవారం ఎన్‌ఎస్‌పీ ప్రాంతం లోని పంచాయతీరాజ్‌ శిక్షణ భవనంలో కౌంటింగ్‌ నిర్వ హించనున్నారు. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు చేసిన ఫిర్యాదును ఎన్నికల సంఘం తోసి పుచ్చింది. సోమవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ , సీపీ విష్ణు యస్ వారియర్ లు ఎన్నికల ఏర్పాట్లను గురించి వివరించారు.

బ్యాలెట్‌ బాక్సులను ప్రస్తుత ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో భద్రపరిచారు. జిల్లాలో మొత్తం 768 ఓట్లుండగా 739ఓట్లు పోలైన విషయం తెలిసిందే.. ఓట్ల లెక్కింపుకోసం మొత్తం నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అందరి సమక్షంలో బ్యాలెట్‌ బాక్సులు ఓపెన్‌ చేసిన తరువాత బ్యాలెట్‌ పత్రం ఓపెన్‌చేయకుండానే సంబంధిత బ్యాలెట్‌ బాక్సులో ఉన్న బ్యాలెట్‌ పత్రాలను, పోలైన ఓట్లసు సరిచూసిన తర్వాత 25 బ్యాలెట్‌ పత్రాలను ఒక కట్టగా కడతారు. ఆ తర్వాత అన్ని కట్టలను ఒక డ్రమ్ములో పోసి కలుపుతారు. అనంతరం ఒక్కోటేబుల్‌కు 200ఓట్ల చొప్పున మూడు టేబుళ్లు 600, నాలుగువ టేబుల్‌కు 139 ఓట్లను కేటాయిస్తారు. అనంతరం కౌంటింగ్‌ ప్రక్రియ మొదల వుతుంది. పోలైన ఓట్లలో సగానికి మించి మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏ అభ్యర్థికి వస్తే వారు విజయం సాధిస్తారు. అలాకాకుండా 370కంటే తక్కువ ఓట్లు వస్తే నలుగురు అభ్యర్థుల్లో అతి తక్కువ వచ్చిన అభ్యర్థిని మొదటి ప్రాధాన్యత ఓట్లతో సరిచూసి ఎలిమినేట్‌ చేస్తారు. ఇలా ఎలిమినేషన్‌ పద్దతితలో చివరికి ఎవరికైతే 370 ఓట్లు వస్తాయో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహణకు సిబ్బందికి ఇప్పటికే జిల్లా యంత్రాంగం శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. ఈ ఎన్నికల్లో మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా నాలుగు టేబేళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో అభ్యర్థికి నలుగురు కౌంటింగ్‌ ఏజెంట్లను కూడా అనుమతిస్తారు. ఇక కౌంటంగ్‌కు ముందే జిల్లాలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అబ్యర్థులు, పార్టీల నేతలు గెలుపుధీమా వ్యక్తం చేస్తున్నారు. తాము అద్భుత మెజారిటీతో గెలుస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు విశ్వాసం ప్రకటించారు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు సైతం తాను 98ఓట్లతో విజయం సాధిస్తామని ప్రకటించారు. ఇలా విజయంపై ఎవరికి వారు ధీమాగా ఉండగా ఫలితం రేపు తేలనుంది.

అభ్యర్హుల్లో టెన్షన్ ….

ఒకపక్క టీఆర్ యస్ కు లెక్కల రీత్యా క్లియర్ మెజార్టీ ఉన్న ఎక్కడో చెప్పలేని సందేహం …మరోపక్క తమకు మెజారిటీ లేనప్పటికీ పోటీనిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి కు సైతం లోలోన గుబులు దీంతో అభ్యర్థులలో టెన్షన్ నెలకొన్నది . క్రాస్ ఓటింగ్ జరిగిందని కొన్ని నియోజకవర్గాలలో దానిప్రభావం ఉంటుందని కాంగ్రెస్ అభ్యర్థి నమ్ముతున్నారు. దాన్ని టీఆర్ యస్ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. వార్ వన్ సైడ్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Related posts

నా మొబైల్ ఫోన్‌ను ట్యాప్ చేశారు: రాహుల్ గాంధీ ఆగ్ర‌హం!

Drukpadam

విదేశీ గడ్డపై సొంత దేశాన్ని విమర్శించడం ఏ నాయకుడికీ తగదు: రాహుల్‌పై అమిత్ షా…

Drukpadam

ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. 

Drukpadam

Leave a Comment