Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

షాకింగ్ విద్యుత్ చార్జీల పెంపునకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!

షాకింగ్ విద్యుత్ చార్జీల పెంపునకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
-కేంద్రం వల్లనే విద్యుత్ చార్జీల భారం …రాష్ట్ర ప్రభుత్వం
-రూ. 50 ఉండే గ్రీన్ ఎనర్జీ సెస్ రూ. 400 వరకు కేంద్ర ప్రభుత్వం పెంచింది
-పేదలపై భారం పడకూడదన్న కేసీఆర్
-సోలార్ పవర్ పై ద్రుష్టి సారించాలి

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు సీఎం కేసీఆర్ అనుమతులు జారీ చేశారు. విద్యుత్ చార్జీల పెంపు కేవలం కేంద్రం పాపమేనని అన్నారు .కేంద్రం గ్రీన్ ఎనర్జీ సెస్ పెంచినందునే తాము విద్యుత్ చార్జీలు పెంచక తప్పటం లేదని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది .

దీంతో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈఆర్ సీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. అలాగే రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల పై భారం పడకుండా ఛార్జీలు పెంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో కొత్త ప్రాజెక్ట్ లను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ముఖ్యం గా సోలార్ పవర్ పై దృష్టి సారించాలని సూచించారు.

అయితే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ముఖ్య కారణం.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలనే అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటి వరకు గ్రీన్ ఎనర్జీ సెస్ ను భారీగా పెంచిందని అన్నారు. రూ. 50 ఉండే గ్రీన్ ఎనర్జీ సెస్ రూ. 400 వరకు కేంద్ర ప్రభుత్వం పెంచిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. దీంతో గత ఏడేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పై రూ. 7,200 కోట్ల భారం పడుతుందని అంటుంది. అయితే తప్పని పరిస్థితుల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించింది.

Related posts

పాకిస్థాన్‌లో గోధుమపిండి కోసం తొక్కిసలాట..11 మంది మృతి!

Drukpadam

కమ్యూనిస్టు సిద్ధాంతం మాత్రమే ప్రజల అవసరాలను గుర్తిస్తుంది .. కూనంనేని

Ram Narayana

తనను అమ్మాయిలు ఇష్టపడటం లేదు … నాకో అమ్మాయిని చూసి పెట్టండి ఎమ్మెల్యేకి యువకుడి లేఖ!

Drukpadam

Leave a Comment