సొంత ఊర్లో పులకించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ
-పొన్నవరం చేరుకున్నసీజేఐ ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు
-చిన్ననాటి జ్ఙాపకాలు నేమేరేసుకున్న సీజేఐ
-బంధువులను ,స్నేహితులను గుర్తు చేసుకున్న సిజెఐ
-తెలుగు వాళ్ళ గొప్పతనాన్ని ఉదహరించిన వైనం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ తన స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరంలో ఘనస్వాగతం లభించింది. భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవి భాద్యతలు చేపట్టిన తరువాత తొలిసారి స్వగ్రామం వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను ఎడ్ల బండిపై ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకెళ్లారు. మేళతాళాలు, జనసందోహం నడుమ సీజేఐను గ్రామంలోకి ఆహ్వానించారు. అనంతరం పొన్నవరంలోని శివాలయంలో ఆయన ప్రత్యేక పూజులు నిర్వహించారు. అనంతరం గ్రామస్థుల పౌరసన్మానాన్ని జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు స్వీకరించనున్నారు. గ్రామంలో ఆయన నాలుగు గంటలపాటు గడపనున్నారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో పొన్నవరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన పౌరసన్మాన సభలో పాల్గొని తన చిన్ననాటి తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు . పొలంగట్ల మధ్యలో తన స్నేహితుడితో కలిసి తిరిగిన అనుభవాలను వివరించారు. బంధువులను గ్రామంలోని ఇతర పెద్దలను ఆయన పేరు పేరున ప్రస్తావించారు. తన ఎక్కడ ఉన్న ఈ గ్రామ బిడ్డనే మీ బిడ్డనే అంటూ ప్రజల హర్షద్వానాల మధ్య తన మనుసులో అభిప్రాయాలు పంచుకున్నారు. తన వెదుగుదలకు కారణమైన తన సోదరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు .
1967లోనే రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం మా పొన్నవరం గ్రామం అని పేర్కొన్నారు. పొన్నవరం, కంచికచర్లలో తన ప్రాథమిక విద్యాభ్యాసం జరిగిందని వెల్లడించారు. తాను ఈ స్థాయికి ఎదగడంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని తెలిపారు. చిన్నప్పుడు ఉపాధ్యాయులు తనను ఎంతో ప్రేమగా చూసేవారని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. మీ అందరి అభిమానం, ఆశీస్సులతోనే ఈ స్థాయిలో ఉన్నానని వినమ్రంగా తెలిపారు. ఎంత ఎదిగినా మాతృభూమిని మర్చిపోలేదని, పొన్నవరం గ్రామ ప్రజల ఆశీస్సుల కోసమే వచ్చానని పేర్కొన్నారు.
సమస్య ఎలాంటిదైనా ప్రజల ఐకమత్యమే మందు అని పేర్కొన్నారు. తెలుగువారి గొప్పదనం మరింత పెంచేలా మనం నడుచుకోవాలని సూచించారు. తెలుగువారి గొప్పదనం గురించి ఢిల్లీలో అనేకమంది చెబుతారని, తమ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను తెలుగువారే నిర్మించారని చెబుతారని సీజేఐ వెల్లడించారు.
తెలుగు వారి గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో అక్కడ పార్లమెంట్ భవనాన్ని కట్టింది కూడా తెలుగు వాడే అంటూ ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలుగు వారికీ ఒక ప్రత్యేక ఉందని అనేక మంది పేర్లు ఉదహరించారు. ఢిల్లీలో కూడా తెలుగు వారిగురించి చర్చ వచ్చినప్పుడు గొప్పవ్యక్తుల ప్రస్తావన ఉంటుందని తెలిపారు . ఈ సందర్భంగా భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణ గురించి ప్రస్తావించారు. కరోనా వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి అందించిన ఘనత ఆయనదేనని అన్నారు . ఆయన తాను తమిళనాడు వాడినని అనుకున్న కాదు చిత్తూరు జిల్లా వాసెనని నవ్వుతు అన్నారు. కార్యక్రమం లో పలువురు న్యాయమూర్తులు , రాష్ట్ర మంత్రులు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి , పేర్ని నాని , ఎమ్మెల్యేలు జగన్ మోహన్ రావు , భూమన కరుణకర్ రెడ్డి , రాష్ట్ర సీఎస్ ,డీజీపీ లు పాల్గొన్నారు.