Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య కేసు.. ఎమ్మెల్యే వనమా కుమారుడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య కేసు.. ఎమ్మెల్యే వనమా కుమారుడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
పాతపాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య
రామకృష్ణ సెల్ఫీ వీడియోను కోర్టుకు సమర్పించిన పోలీసులు
రాఘవేంద్రరావు కోసం గాలిస్తున్న పోలీసులు

వనమా రాఘవ పాల్వంచలో జరిగిన కుటుంబ ఆత్మహత్య కేసులో ఇరుక్కున్నారు . సూసైడ్ నోట్ లో ఆయన పేరుందని తెలియగానే ఆయన ఇంటినుంచి ఎస్కేప్ అయ్యారు . దీనిపై పోలీసులు దర్యాప్తు జరిపి రాఘవను ఏ 2 నిందితుడిగా చేర్చారు. రాజకీయపార్టీలు కూడా ఈ చర్యను ఖండిస్తున్నాయి. ఎమ్మెల్యే కుమారుడిగా వనమా రాఘవ అరాచకాలు అన్ని ఇన్ని కావని గతంలో కూడా అనేకమందిని ఆయన బెదిరించిన సంఘటనలు ఉన్నాయని అంటున్నారు. పాల్వంచలో పర్యటించిన సీఎల్పీ నేత భట్టి సైతం వనమా రాఘవ ఆకృత్యులపై ఘాటుగా స్పందించారు. పోలీసులు పట్టించుకోక పోవడం వల్లనే రాఘవ దందా ,దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని అన్నారు. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు, టీఆర్ఎస్ నేత వనమా రాఘవేంద్రరావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో పోలీసులు ఆయనను ఎ2 నిందితుడిగా చేర్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో సోమవారం ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

ఆత్మహత్యకు ముందు బాధితుడు రామకృష్ణ మాట్లాడిన సెల్ఫీ వీడియోను స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని కోర్టుకు సమర్పించారు. సూసైడ్ నోట్ ఆధారంగా రాఘవేంద్రను ఈ కేసులో ఎ2 నిందితుడిగా చేర్చిన పోలీసులు పరారీలో ఉన్న రాఘవేంద్ర కోసం గాలిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను కూడా నియమించారు.

కాగా, ఈ ఘటనపై రాజకీయంగా వేడి రాజుకుంది. రాఘవేంద్రరావు అరాచకాలను పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కుమారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామకృష్ణ కుమార్తె సాహితిని భట్టి విక్రమార్క నిన్న పరామర్శించారు.

Related posts

నార్సింగిలో… వైన్ షాపులో దొంగతనానికి వచ్చి తాగి నిద్రపోయాడు!

Ram Narayana

హైదరాబాదులో 8 ఏళ్ల బాలుడి దారుణ హత్య..

Drukpadam

12 రోజుల క్రితం అదృశ్యమై విగతజీవిగా కనిపించిన హర్యాన్వీ గాయని!

Drukpadam

Leave a Comment