Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఢిల్లీలో ముగిసిన మౌనదీక్ష.. కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్!

ఢిల్లీలో ముగిసిన మౌనదీక్ష.. కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్!

  • రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్
  • ఆయనకు అంత అహంకారం ఎందుకన్న సంజయ్
  • జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని కూడా మార్చాలంటాడేమో

రాజ్యాంగాన్ని మార్చాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అనడంపై సర్వత్రా విమర్శలు వెల్లు ఎత్తు తున్నాయి. దళిత సంఘాలనుంచి అనూహ్యంగా పెద్ద ఎత్తున అందోళనలు చవి చూడాల్సి వచ్చింది. ఒక్క టీఆర్ యస్ తప్ప అన్ని పార్టీలు దీనిపై కేసీఆర్ తీరును తప్పు పట్టాయి. అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీ కోరుకునేది ,కేసీఆర్ నోటి నుంచి వచ్చిందని, ఇది ఇద్దరి మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమేనని ఆరోపణలు చేస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ రాజ్యాంగ మార్పు మాటలపై ఏకంగా దీక్షకు దిగారు . ఢిల్లీలో ఒకరోజు మౌన దీక్ష చేశారు .

భారత రాజ్యాంగంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో మౌనదీక్ష చేపట్టారు. దీక్ష ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు అంత అహంకారం ఎందుకని ప్రశ్నించారు.

కేసీఆర్ చేసిందే తప్పంటుంటే… ఆ వ్యాఖ్యలను సమర్థించేలా టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఒక సామాన్యుడు ఈ దేశానికి ప్రధాని అయ్యాడంటే దానికి కారణం అంబేద్కరే అని అన్నారు. తమ ప్రభుత్వం అంబేద్కర్ ను సగౌరవంగా సత్కరిస్తోందని చెప్పారు.

అంబేద్కర్ రాజ్యాంగం మాకొద్దు, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అనే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోయినా నన్నెవరూ నిలదీయొద్దు అనే విధంగా కేసీఆర్ తీరు ఉందని అన్నారు. రేపు జాతీయ జెండాను, జాతీయ గేయాన్ని కూడా మార్చాలంటాడేమోనని ఎద్దేవా చేశాడు.

Related posts

మోదీజీ మా అందరినీ అరెస్ట్ చేయండి.. కేంద్రంపై అరవింద్ కేజ్రీవాల్ ఫైర్!

Drukpadam

కుప్పం ప్రజలకు చంద్రబాబు భరోసా… 1 కోటి వ్యయంతో పలు కార్యక్రమాలు!

Drukpadam

ఫడ్నవిస్ మిరకిల్ చేశారు: శరద్ పవార్

Drukpadam

Leave a Comment