Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పాకిస్థాన్ లో.. బార్బర్ షాపుకు వెళ్లిన జర్నలిస్టు కాల్చివేత

  • సింధ్ ప్రావిన్స్ లోని సుక్కూర్ లో ఘటన
  • వాహనాల్లో వచ్చిన దుండగులు
  • జర్నలిస్టుపై విచక్షణ రహితంగా కాల్పులు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన జర్నలిస్టు
Hindu journalist killed in Pakistan

పాకిస్థాన్ లో  జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ పాత్రికేయుడి పేరు అజయ్ లాల్వానీ. వయసు 31 సంవత్సరాలు. ‘పుచానో’ అనే ఉర్దూ దినపత్రికలో అజయ్ లాల్వానీ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. సింధ్ ప్రావిన్స్ లోని సుక్కూర్ పట్టణంలో ఆయనను దుండుగులు కాల్చి చంపారు. క్షవరం చేయించుకునేందుకు ఓ బార్బర్ షాపుకు వెళ్లిన అజయ్ పై రెండు బైకులు, ఓ కారులో వచ్చిన దుండుగులు తూటాల వర్షం కురిపించారు. విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో తీవ్రగాయాలపాలైన ఆ యువ పాత్రికేయుడు చికిత్స పొందుతూ మరణించాడు.

అజయ్ లాల్వానీ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు చెబుతుండగా, తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడికి ఎవరితోనూ శత్రుత్వంలేదని అంటున్నారు. అజయ్ హత్యను హిందూ ప్రజాప్రతినిధి లాల్ చంద్ హల్హీ ఖండించారు. ఈ ఘటన తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు. అటు, పాత్రికేయ సంఘాలు కూడా అజయ్ హత్యపై తీవ్రంగా స్పందించాయి. పాత్రికేయులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

Related posts

పోలీస్ గౌరవం మరింత పెంపొందించేలా పని చేయాలి : డిజిపి మహేందర్ రెడ్డి…

Drukpadam

పీజీ నీట్ ను వాయిదా వేయలేం.. కొందరి కోసం ఎక్కువ మందికి నష్టం చేయలేం: సుప్రీంకోర్టు!

Drukpadam

గిఫ్ట్ ఏ స్మైల్.. విక‌లాంగుల‌కు 100 బైక్‌లు అందించ‌నున్న కేటీఆర్..

Drukpadam

Leave a Comment