Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి….

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి….
-తెలంగాణ ఉద్యమంలో బందూకు పట్టిన వీరవనిత గుర్తింపు
-చివరకంటూ ప్రజాఉద్యమాల్లోనే పనిచేసిన ధీశాలి
-కుటుంబం అంతా సిపిఎం రాజకీయాలలోనే

నైజం ప్రభుత్వాన్ని గడగడలాడించిన సాయుధ రైతాంగ పోరాటంలో ముందుపీఠిన నిలిచిన వీరవనిత మల్లు స్వరాజ్యం(93 ) ఇకలేరనే వార్త యావత్ తెలుగు జాతిని దుఃఖసాగరంలో ముంచింది. స్వయంగా ఆయుధం పట్టి ఉద్యమంలో ఉరకలు పెట్టిన మల్లు స్వరాజ్యం మృతి పీడిత తాడిత ఉద్యమాలకు తీరని లోటు … ఆమె ఒక శక్తి , నిత్యం పేదలకోసం , కార్మిక , కార్షిక ఉద్యమాలలో చుకురుగ్గా పాల్గొన్నది . మహిళా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మల్లు స్వరాజ్యం మరణం మహిళాలోకానికి పూడ్చలేని నష్టాన్ని మిగిల్చింది.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు. వీరికి వందలాది ఎకరాల భూమి కలదు. వీరిది భూస్వామ్య కుటుంబం. 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించారు. 1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం ఇంటిని నైజాం గుండాలు తగలబెట్టారు . మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో అదిలాబాద్ ,వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు.

మహిళ కమాండర్ గా పని చేశారు. అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యం పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించింది.. ఆంధ్ర మహాసభ పిలుపు తో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. వీరి భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. వీరి సోదరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుండి 83 వరకు మొదటి దఫా, రెండవ దఫా 1983 నుండి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీ తరఫున పనిచేశారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. మల్లు స్వరాజ్యం గారికి ఒక కూతురు ఆమె పేరు పాదూరి కరుణ ఆమెకు ఇద్దరు కుమారులు ఒక కూతురు పెద్ద కుమారుడి పేరు మల్లు గౌతమ్ రెడ్డి ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు కలదు. చిన్న కుమారుడు మల్లు నాగార్జున రెడ్డి కి ఇద్దరు కుమారులు కలరు. వీరి చిన్న కోడలు మల్లు లక్ష్మి గత పార్లమెంట్ ఎన్నికలు నల్గొండ ఎంపీగా పోటీ చేశారు. వీరి పెద్ద కుమారుడు మల్లు గౌతంరెడ్డి సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా పని చేస్తున్నారు చిన్న కుమారుడు మల్లు నాగార్జున్ రెడ్డి సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి గా పని చేస్తున్నారు.

మల్లు స్వరాజ్యం మృతి పట్ల తెలంగాణ , ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్ , జగన్ మోహన్ రెడ్డి , చంద్రబాబు , సిపిఎం ,సిపిఐ ఉభయ రాష్ట్రాల కార్యదర్శులు , తమ్మినేని వీరభద్రం , చాడ వెంకటరెడ్డి , వి శ్రీనినివాసరావు , రామకృష్ణ , కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి , శైలజానాథ , సంతాంపం తెలిపారు .

Related posts

ఈడీ అధికారాలేంటి ?., సెక్షన్- 50 ఏం చెబుతుంది ?

Drukpadam

చైనా, పాక్ లకు భారత్ ఆర్మీ చీఫ్ ఘాటు హెచ్చరిక …మా సహనాన్ని పరీక్షించ వద్దని చురకలు!

Drukpadam

కాలికి గాయంతో వీల్ చెయిర్లోనే పార్లమెంటుకు వచ్చిన శశి థరూర్!

Drukpadam

Leave a Comment